iDreamPost

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు పనిచేసే బ్యాటరీ.. స్మార్ట్ ఫోన్లు- డ్రోన్లలో..!

Betavolt Nuclear Battery: మార్కెట్ లోకి సరికొత్త బ్యాటరీ వచ్చేస్తోంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు.

Betavolt Nuclear Battery: మార్కెట్ లోకి సరికొత్త బ్యాటరీ వచ్చేస్తోంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు పనిచేసే బ్యాటరీ.. స్మార్ట్ ఫోన్లు- డ్రోన్లలో..!

ఇప్పుడు అన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయిపోయాయి. అయితే వీటిలో ముఖ్యంగా చెప్పుకునేవి స్మార్ట్ ఫోన్లు. ఒకప్పుడు అయితే ఒక ఫోన్ ని ఛార్జ్ చేసేందుకు కనీసం 3 నుంచి 5 గంటల సమయం పట్టేది. ఆ తర్వాత ఆ సమయం సగానికి పడిపోయింది. ఇప్పుడు 40 నిమిషాల్లోపే ఫోన్ ని ఛార్జ్ చేసేయచ్చు. అంతలా సూపర్ ఫాస్ట్ ఛార్జర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వినియోగదారులు మాత్రం అస్సలు ఛార్జ్ చేసే అవసరం లేని స్మార్ట్ ఫోన్లు వస్తే బాగుంటాయి కదా అంటూ ఉంటారు. అలాంటి ఒక కోరిక తీరే రోజు దగ్గర్లోనే ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఎంత సూపర్ ఫాస్ట్ ఛార్జర్లు వచ్చినా కూడా వినియోగదారుల అంచనాలను అందుకోలేకపోతున్నాయి. ఎందుకంటే వాళ్లు అసలు ఛార్జింగ్ పెట్టే అవసరమే లేని ఒక బ్యాటరీ వస్తే బాగుండు కదా అని కోరుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా సాధ్యమే అంటూ టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్ లోకి ఒక అద్భుతమైన బ్యాటరీ రాబోతోంది. దానిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు పనిచేస్తుంది. మీరు దానిని ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఎలాంటి మెయిన్టెనెన్స్ కూడా అవసరం లేదని చెబుతున్నారు. ఈ సూపర్ బ్యాటరీని చైనాకు చెందిన బెటావోల్ట్ అనే కంపెనీ తయారు చేస్తోంది. ఇది ఒక న్యూక్లియర్ బ్యాటరీ. ఇది గరిష్టంగా 50 ఏళ్ల పాటు విద్యుత్ ని ఉత్పత్తి చేయగలదు.

అలాగని ఈ బ్యాటరీ భారీ పరిమాణంలో ఉండదు. ఒక నాణెం కంటే కూడా చిన్నగా ఉంటుంది. కంపెనీ ఈ బ్యాటరీ టెక్నాలజీని స్మార్ట్ ఫోన్స్ కి అప్లై చేయాలని చూస్తోందట. అంటే ఈ న్యూక్లియర్ బ్యాటరీని స్మార్ట్ ఫోన్లు, డ్రోన్లకు వినియోగించేలా తయారు చేసే యోచనలో ఉన్నారంట. అదే గనుక జరిగితే టెక్నాలజీ యుగంలో అది ఒక అద్భుతమే అవుతుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ల తరహాలోనే డ్రోన్ల బ్యాటరీలను కూడా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 నుంచి 25 నిమిషాల వరకు ఫ్లై చేసే ఛాన్స్ ఉంటుంది.

ఈ న్యూక్లియర్ బ్యాటరీని డ్రోన్లకు ఉపయోగించే పరిస్థితి వస్తే.. వ్యవసాయం మాత్రమే కాకుండా రక్షణ రంగం, ట్రాన్స్ పోర్టుకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా లేయర్లు లేయర్లుగా ఈ బ్యాటరీ ఉంటుంది కాబట్టి.. ఇది పేలడం, మంటలు అంటుకునే ప్రమాదం కూడా ఉండదట. ఈ బ్యాటరీ వల్ల ఛార్జ్ చేసే ప్రయాస తగ్గడం మాత్రమే కాకుండా, బ్యాటరీలు పేలే ప్రమాదం కూడా ఉండదు. టెక్నాలజీ పరంగా ఈ బ్యాటరీలు సరికొత్త విప్లవమే అవుతుంది. నెట్టింట కూడా ఈ బ్యాటరీల పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ధర మాత్రం కచ్చితంగా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఇది చైనా కంపెనీ కాబట్టి గ్యారెంటీ ఇవ్వలేం అంటూ ఛలోక్తులు కూడా విసురుతున్నారు. మరి.. చైనా కంపెనీ తయారు చేస్తున్న ఈ బ్యాటరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి