iDreamPost

రూ.10 వేలలోపే.. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్!

Best Budget SmartPhone Details: మీరు మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఫోన్ గురించి ఒకసారి చూడండి.

Best Budget SmartPhone Details: మీరు మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఫోన్ గురించి ఒకసారి చూడండి.

రూ.10 వేలలోపే.. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్!

స్మార్ట్ ఫోన్ అంటే తెలియనివాళ్లు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు ఫోన్ అంటేనే స్మార్ట్ ఫోన్ అనే పరిస్థితి వచ్చేసింది. అయితే స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే కాస్త ఖర్చు ఎక్కువగా పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ, ఇప్పుడు మార్కెట్ లోకి తక్కువ ధరలో కూడా స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, వాటిల్లో ధర తక్కువ ఉన్నా డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికషన్స్ మాత్రం ఒకటి ఉంటే ఒకటి ఉండే పరిస్థితి లేదు. కానీ, ఇప్పుడు ఒక మంచి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది. ధర, తక్కువ, అదిరిపోయే డిజైన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి.

ఇప్పుడు చెప్పుకోబోయేది రెడ్ మీ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ గురించి. రెడ్ మీ సంస్థకు ఇండియాలో ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. స్మార్ట్ పోన్స్, టీవీలు అంటూ రెడ్ మీ కంపెనీకి చెందినవి తెగ కొనేస్తుంటారు. ఇప్పుడు ఆ కంపెనీ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. అదే రెడ్ మీ ఏ3 స్మార్ట్ ఫోన్. దీని లుక్స్ చూస్తే మీకు.. వన్ ప్లస్ కు చెందిన రూ.70 వేలు విలువజేసే ఫోన్ తరహాలో ఉన్నాయి. ఎంతో స్టైలిష్ అండ్ స్లీక్ డిజైన్ తో ఈ రెడ్ మీ ఏ3 స్మార్ట్ ఫోన్ అయితే వస్తోంది. ఇంక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. మొత్తం 3 వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ను రూ.7,299గా ఉంది. 4 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,299గా ఉంది. 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,299గా ఉంది.

ఈ రెడ్ మీ ఏ3 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ప్రీమియం హాలో డిజైన్ తో వస్తోంది. ఇందులో 6.71 ఇంచెస్ లార్జ్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తోంది. 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ36 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంత తక్కువ ధర అయినా కూడా కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ఈ డిస్ ప్లే వస్తోంది. అంటే దాదాపుగా ఫోన్ స్క్రీన్ పగిలే ఛాన్స్ లేదనే చెప్పాలి. సెక్యూర్డ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో ఈ రెడ్ మీ ఏ3 స్మార్ట్ ఫోన్ వస్తోంది.

ఇందులో 6 జీబీ+ 6జీబీ వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు మీ మొబైల్ ర్యామ్ ని 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరా చూస్తే.. బ్యాక్ సైడ్ 8 ఎంపీ కెమెరా, ఫ్రంట్ 5ఎంపీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్ సీ ఛార్జర్ తో ఈ ఫోన్ వస్తోంది. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ ఫోన్ 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేయకపోవడం మాత్రం కాస్త డిజపాయింటింగ్ అంశం అని చెప్పాలి. మంచి బడ్జెట్ 4జీ ఫోన్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. మరి.. ఈ రెడ్ మీ ఏ3 స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి