iDreamPost

36 గంటల పాటు మహిళా లాయర్ డిజిటల్ అరెస్ట్.. దేశంలో తొలి కేస్.. ఎందుకంటే..?

వామ్మో అకౌంట్లో డబ్బులకు రెక్కలు వస్తున్నాయి. కొత్త కొత్త మోసాలతో కేటుగాళ్లు ఖాతాల్లో నగదును ఖాళీ చేసేస్తున్నారు. ఇప్పుడు మరో సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. బహుశా దేశంలో ఇదే తొలిది కావొచ్చును కూడా.

వామ్మో అకౌంట్లో డబ్బులకు రెక్కలు వస్తున్నాయి. కొత్త కొత్త మోసాలతో కేటుగాళ్లు ఖాతాల్లో నగదును ఖాళీ చేసేస్తున్నారు. ఇప్పుడు మరో సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. బహుశా దేశంలో ఇదే తొలిది కావొచ్చును కూడా.

36 గంటల పాటు మహిళా లాయర్ డిజిటల్ అరెస్ట్.. దేశంలో తొలి కేస్.. ఎందుకంటే..?

నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో ఈ మోసాలు జరుగుతున్నాయి. ఈ తరహా చీటింగ్ ఇండియాలో బహుశా ఇదే తొలిది అయ్యి ఉండొచ్చు. ఓ మహిళా లాయర్ డిజిటల్ అరెస్టు అయ్యింది. వినడానికి కొత్తగా అనిపించినా మీరు వింటున్నది నిజమే. ఇప్పుడు ఈ అరెస్టు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఇంతకు ఆమె చేసిన నేరమేంటీ.. ఈ అరెస్టు ఏంటనీ కంగారు పడుతున్నారా.. అయితే ఈ డిజిటల్ అరెస్టు ఏంటంటే.. అదే రకమైన సైబర్ క్రైమ్. దీనికి బాధితురాలు అయ్యింది బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల మహిళా లాయర్. 36 గంటలు.. అంటే ఒకటిన్నర రోజులుగా డిజిటల్ అరెస్టు అయ్యింది. ఇంతకు ఏం జరిగిందంటే..?

ఏప్రిల్ 9వ తేదీ రాత్రి మహిళా లాయర్‍కు మొబైల్ యాప్ స్కైప్‌లో థాయ్ లాండ్ నుండి ఓ వీడియో కాల్ వచ్చింది. ఒకరు ముంబయి సీబీఐ అధికారి అభిషేక్ చౌహాన్‌గా, మరొకరు థాయ్ లాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నారు. మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫెడెక్స్ మాదక ద్రవ్యాల పార్శిల్‌కు సంబంధించి విచారిస్తున్నామని ఆమెకు చెప్పారు. బెంగళూరు నుండి థాయ్ లాండ్‌కు పార్సిల్ వచ్చింది. అందులో ఐదు నకిలీ పాస్ పోర్టులు, మూడు క్రెడిట్ కార్డులు, 140 డ్రగ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయని, మీరు మానవ అక్రమ రవాణాతో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారని, మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఆమెను విచారించడం మొదలు పెట్టారు.

అయితే తాను ఎలాంటి పార్సిల్ పంపలేదని, ఎలాంటి నేరానికి పాల్పడలేదని, టైంకి ఇన్ కం ట్యాక్స్ కడుతున్నానంటూ చెప్పుకొచ్చింది. ఆమెను అన్ని వివరాలు షేర్ చేయాలని చెప్పారు. ఇందులో బడా బడా నేతలు, బిజినెస్ టైకూన్స్ ప్రమేయం ఉందని, ఈ విషయం ఎక్కడ లీక్ చేయకూడదంటూ.. విచారణ పూర్తయ్యేంత వరకు ఈ వీడియో కాల్ నుండి బయటకు వెళ్లకూడదంటూ తెలిపారు. అలా చేస్తే వెంటనే మిమ్మల్ని స్థానిక సీబీఐ అరెస్ట్ చేస్తుదంటూ చెప్పారు. ఇలా ఆమె నుండి బ్యాంక్ ఖాతా వివరాలు, వెరిఫికేషన్, క్రెడిట్ కార్డు వివరాలు సేకరించారు. అలా తొలుత రూ. 10.79 లక్షలు బదిలీ చేసుకున్నారు. అలాగే రూ. 3.77 లక్షల ఆన్ లైన్ షాపింగ్ చేశారు. అలా ఆమెను 36 గంటల పాటు డిజిటల్ అరెస్టులో ఉంచి.. ఇదంతా కానిచ్చారు మోసగాళ్లు.  ఆ తర్వాత విడుదల చేశారు.

ఆ తర్వాత ఆమె సమాచారం కోసం బెంగళూరు సిటీ శివాజీనగర్‌లోని ఈస్ట్ డివిజన్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఎంక్వయిరీ చేయగా.. అప్పుడు తెలిసింది తాను మోసపోయానని. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బాధితురాలు, ఇతర వివరాలు వెల్లడించలేదు బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు. ఇది ఓ సైబర్ నేరంగా గుర్తించి విచారణ చేపడుతున్నారు. అలాగే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫెడ్ ఎక్స్ సంస్థ కూడా దీనిపై స్పందించింది. కస్టమర్స్ అభ్యర్థిస్తే తప్ప.. ఎవరికీ వ్యక్తిగత సమాచారాన్ని తమ సంస్థ బదిలీ చేయదు అంటూ చెప్పుకొచ్చింది. ఎవరికైనా అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు వస్తే వ్యక్తిగత సమాచారాన్ని అందించవద్దని సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి