iDreamPost

రంజీ మ్యాచ్‌లో సెంచరీ చేసిన క్రీడా మంత్రి..

రంజీ మ్యాచ్‌లో సెంచరీ చేసిన క్రీడా మంత్రి..

పలువురు సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా క్రీడల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అయితే చాలా మంది క్రీడల్లోంచి రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఇతను మాత్రం ఒక పక్కన క్రీడా మంత్రిగా కొనసాగుతూనే మరో పక్క క్రికెట్ లో శతకాలు బాదేస్తున్నాడు. ప్రస్తుతం రంజీట్రోఫీ 2022 జరుగుతుంది.

రంజీట్రోపీ 2022లో భాగంగా బెంగాల్‌, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించడంతో బెంగాల్‌ జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. జూన్‌ 14-18 మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్లో బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లు పోటీపడనున్నాయి. బెంగాల్‌, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లో ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో గతంలో టీమిండియాకి కొన్ని మ్యాచ్ లు ఆడిన క్రికెటర్‌, ప్రస్తుత బెంగాల్‌ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి సూపర్‌ సెంచరీతో మెరిశాడు. 152 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌ సహాయంతో సెంచరీ మార్క్‌ అందుకున్నాడు.

దీంతో ఒకపక్క రాజకీయాల్లో రాణిస్తూనే మరోపక్క ఆతని కూడా వదిలిపెట్టకుండా ఇలా సెంచరీలు చేస్తుండటంతో అంతా అభినందిస్తున్నారు. మనోజ్ తివారి ఇటీవల జరిగిన బెంగాల్ ఎలెక్షన్స్ లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత మమతా బెనర్జీ క్యాబినెట్ లో క్రీడా మంత్రి అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి