iDreamPost

ఎండల ఎఫెక్ట్.. రోజుకు 2 లక్షల బీర్లు తాగేస్తున్న తెలంగాణ మందుబాబులు!

Beer Sales In Telangana: పది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.. అధిక ఉష్ణోగ్రత కారణంగా జనాలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. వేసవి కాలం కావడంతో వైన్స్ షాపుల్లో చల్లని బీర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.

Beer Sales In Telangana: పది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.. అధిక ఉష్ణోగ్రత కారణంగా జనాలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. వేసవి కాలం కావడంతో వైన్స్ షాపుల్లో చల్లని బీర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.

ఎండల ఎఫెక్ట్.. రోజుకు 2 లక్షల బీర్లు తాగేస్తున్న తెలంగాణ మందుబాబులు!

మార్చి నెల నుంచి తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఏప్రీల్ నెలలో భానుడు తన ప్రతాపాన్ని మరింత పెంచాడు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో 36 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతుంది. మండుతున్న ఎండలు భరించలేక ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. మధ్యాహ్నం సమయంలో నగర వీధులు, రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేని వారు చల్లని పానియాల వెంట పడుతున్నారు. ఇక మద్య బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎండలకు చల్ల చల్లగా బీర్లు లాగించేస్తున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో బీర్ల అమ్మకాల జోరు పెరిగిపోయింది. వేసవి తాపం నుంచి ఊరట పొందేందుకు చాలా మంది బీర్లు తాగుతున్నారు. అయితే డిమాండ్ కి తగ్గట్లు సప్లై లేదని విమర్శలు వస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భరించలేక కస్టమర్లు బీర్ల సీసాలు ఖాళీ చేస్తున్నారు. ప్రతిరోజూ గ్రేటర్ లో 60 వేల నుంచి 80 వేల కేసులకు పైగా బీర్లు అమ్ముడు పోతున్నాయని అంచనా. మరో 20 వేల కేసుల వరకు డిమాండ్ ఉన్నప్పటికీ కొరత కారణంగా వినియోగదారులకు అందడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వంద కేసులకు ఆర్డర్ చేస్తే కేవలం 60 నుంచి 70 కేసుల వరకు సప్లై చేస్తున్నారని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఏప్రిల్ లోనే ఇలా కొరత ఉంటే.. మరి మే, జూన్ లో పరిస్థితి ఏంటా? అని వ్యాపారులు, కస్టమర్లు ఆలోచనలో పడ్డారు.

Telangana tops in beer sales

ఇదిలా ఉంటే.. బీర్ కంపెనీల నుంచి ప్రస్తుతం రోజులకు లక్షన్నర నుంచి 2 లక్షల కేసుల వరకు అందుతున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు రెండు లక్ష కేసులు అమ్ముడు అవుతున్నట్లు అంచనా. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే సగానికి ఎక్కువగా బీర్ లు విక్రయాలు జరుగుతున్నాయని అంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ తో గ్రేటర్ లో సుమారు 12 లక్షల కేసులకు పైగా బీర్లు అమ్మకాలు జరిగాయని.. ఈ ఏడాది 15 లక్షల కేసులకు పైగా డిమాండ్ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భరించలేక మద్యం ప్రియులు చల్లని బీర్లతో చీర్స్ కోట్టేస్తున్నారు.ఇదిలా ఉంటే ఎండల కారణంగా నీటి కొరత తీవ్రంగా ఉందని.. బీర్ల తయారీకి ఇబ్బందులు కలుగుతున్నాయని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కారణంతోనే రోజుకు రెండున్న నుంచి 2 లక్షల కేసుల బీర్లు తయారు చేస్తున్నామని అంటున్నారు. 40 లక్షల లీటర్ ల నీళలు బీర్ ఉత్పత్తికి అవసరమని, కొద్ది రోజులుగా నీటి కొరత బీర్ల ఉత్పత్తిపై ప్రభావం పడిందని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి