iDreamPost
android-app
ios-app

వరల్డ్‌ కప్‌ టికెట్ల విషయంలో BCCI గుడ్‌న్యూస్‌! లక్షల్లో టికెట్లు..

  • Published Sep 07, 2023 | 9:55 AM Updated Updated Sep 07, 2023 | 9:55 AM
  • Published Sep 07, 2023 | 9:55 AMUpdated Sep 07, 2023 | 9:55 AM
వరల్డ్‌ కప్‌ టికెట్ల విషయంలో BCCI గుడ్‌న్యూస్‌! లక్షల్లో టికెట్లు..

ప్రస్తుతం ఆసియా కప్‌ మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేస్తున్న క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. అక్టోబర్‌ 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023 మెగా టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మ్యాచ్‌లు చూసేందుకు క్రికెట్‌ అభిమానులు ఎగబడుతుంటారు. వివిధ దేశాల నుంచి మ్యాచ్‌లు చూసేందుకు భారత్‌కు వస్తుంటారు. ఇక ఇండియాలో క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు కనుక.. స్వదేశంలోనే టోర్నీ మొత్తం జరుగుతుండటంతో టికెట్లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. ముఖ్యంగా ఇండియా ఆడే ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయే అవకాశం ఉంది.

అయితే తాజాగా బీసీసీఐ ఓ 8500 టికెట్లను విడుదల చేసింది. వీటి కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎగబడ్డారు. టికెట్ల కోసం బ్లాక్‌ మార్కెట్‌లో దాదాపు 57 లక్షలు పోసి కూడా టికెట్లు కొన్నట్లు తెలుస్తుంది. అయితే.. అహ్మాదాబాద్‌ ఒక్క స్టేడియంలోనే లక్షమంది కూర్చోని మ్యాచ్‌ వీక్షించే వెసులుబాటు ఉన్నా కూడా బీసీసీఐ కేవలం 8500 టికెట్లు మాత్రమే జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత్‌-పాక్‌ లాంటి కీలకమైన మ్యాచ్‌కు సంబంధించి కేవలం 8500 టికెట్లు మాత్రమే ఎలా విడుదల చేస్తారని, బ్లాక్‌ మార్కెట్‌లో బీసీసీఐనే టికెట్లు అమ్ముతుందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో కాస్త దిగొచ్చిన బీసీసీఐ తాజాగా క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

వరల్డ్ కప్ మ్యాచులకు సంబంధించి ఏకంగా 4 లక్షల టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ కప్ టికెట్ల అమ్మకంలో తదుపరి దశలో ఈ 4 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచనుంది. శుక్రవారం సాయంత్రం 8 గంటలకు ఈ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని బీసీసీఐ వెల్లడించింది. ఈ టికెట్లు కూడా బుక్‌మైషోలోనే దొరుకుతాయట. ఈ వార్త విన్న ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే ఈ వన్ని కేవలం ఇండియా మ్యాచ్‌లకే కాక.. మిగతా దేశాలు ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టాలెంట్‌ లేదు.. లక్కీగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్నాడు! సూర్యపై షాకింగ్‌ కామెంట్స్‌..