iDreamPost

టాలెంట్‌ లేదు.. లక్కీగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్నాడు! సూర్యపై షాకింగ్‌ కామెంట్స్‌..

  • Published Sep 07, 2023 | 9:14 AMUpdated Sep 07, 2023 | 9:14 AM
  • Published Sep 07, 2023 | 9:14 AMUpdated Sep 07, 2023 | 9:14 AM
టాలెంట్‌ లేదు.. లక్కీగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్నాడు! సూర్యపై షాకింగ్‌ కామెంట్స్‌..

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో పాల్గొనే భారత జట్టును ఇటీవల చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రకటించారు. ఈ టీమ్‌లో కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై అలాగే మరికొంతమంది ఎంపికైన ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను టార్గెట్‌ చేస్తూ.. ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డేల్లో అత్యంత చెత్త రికార్డులు ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ను కనీసం వన్డే టీమ్‌లోకి కూడా తీసుకోరని అలాంటిది ఏకంగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి ఎలా తీసుకున్నారంటూ మండిపడ్డాడు.

టామ్‌ మూడీ మాట్లాడుతూ..‘వరల్డ్ కప్ టీంలో సూర్యకుమార్ యాదవ్‌కు పనేంటి?, వన్డేల్లో అతని గణాంకాలు చూస్తే.. అతన్ని అసలు వన్డే టీంలోకి కూడా ఎవరూ తీసుకోరు. సంజూ శాంసన్, తిలక్ వర్మ వంటి మిడిలార్డర్ ఆప్షన్స్ ఉండగా.. సూర్యకుమార్‌ను తీసుకోవడం చాలా మందికి అర్థం కాలేదు. టీం మేనేజ్‌మెంట్ తిలక్ వర్మను తీసుకోవాల్సింది. లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్‌గా ఉన్న తిలక్ వర్మ అవసరమైతే పార్ట్ టైం బౌలర్‌గా కూడా జట్టుకు ఉపయోగపడేవాడు. సంజు, తిలక్‌ లాంటి వాళ్లను వెనక్కు నెట్టి సూర్య వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి రావడం కేవలం అతని లక్‌ మాత్రమే’ అని మూడీ పేర్కొన్నాడు.

అయితే.. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ను వన్డేల్లో కూడా ఆడించి, చివర్లో మంచి ఫినిషర్‌గా వాడుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఎప్పటి నుంచో భావిస్తోంది. కానీ, సూర్యకుమార్‌ యాదవ్‌కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వన్డేల్లో సరైన స్థాయిలో రాణించలేకపోతున్నారు. నిజానికి వన్డేల్లో సూర్య కంటే సంజు శాంసన్‌ మెరుగైన నంబర్స్‌ కలిగి ఉన్నాడు. పైగా వికెట్‌ కీపర్‌గా జట్టుకు మంచి ఆప్షన్‌గా కూడా ఉంటాడు. ఇక పోతే తిలక్‌ వర్మకు ఇప్పటి వరకు వన్డే క్రికెట్‌ ఆడిన అనుభవం లేకపోయినా.. ఇప్పటి వరకు అతను ఆడిన టీ20 మ్యాచ్‌ల్లో అతన్ని మంచి క్రూషియల్‌ ఇన్నింగ్స్‌లే ఆడాడు. పైగా దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తిలక్‌ మంచి ప్రదర్శన కనబర్చాడు. దీంతో అతన్ని ఎంపిక చేసి ఉన్నా కూడా సూర్య కంటే బెటర్‌ పిక్‌ అయ్యేవాడు. మరి ఏది ఏమైనా టీమ్‌ ఎంపిక జరిగిపోయింది కనుకా.. ఎన్ని చెప్పుకున్నా వేస్ట్‌. అయితే.. సూర్య ఎంపికను టామ్‌ మూడీ తప్పుబట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: సెంచరీతో దుమ్ములేపిన పూరన్‌! ఇది కదా బాదుడంటే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి