Nidhan
టీమిండియా కొత్త హెడ్ కోచ్ నియామకం మీద గత కొన్ని వారాలుగా అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు కోచ్ రాకకు ముమూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
టీమిండియా కొత్త హెడ్ కోచ్ నియామకం మీద గత కొన్ని వారాలుగా అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు కోచ్ రాకకు ముమూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
Nidhan
భారత క్రికెట్‌కు సంబంధించి ఇటీవల బాగా చర్చనీయాంశంగా మారిన అంశాల్లో ఒకటి హెడ్ కోచ్ నియామకం. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో టీమ్‌ను వీడనున్నాడు. ఇంకొన్నాళ్లు జట్టుతో ట్రావెల్ చేయడాల్సిందిగా భారత క్రికెట్ బోర్డు కోరినా ద్రవిడ్ తిరస్కరించాడు. దీంతో అతడి ప్లేస్‌లో సమర్థవంతమైన కోచ్ కోసం బీసీసీఐ వెతుకులాట మొదలుపెట్టింది. దీంట్లో భాగంగా హెడ్ కోచ్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దీనికి ఎవరెవరు అప్లై చేసుకున్నారో తెలియదు. కానీ ఆస్ట్రేలియా దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్‌తో పాటు న్యూజిలాండ్ లెజెండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్లు మాత్రం గట్టిగా వినిపించాయి. వీళ్ల కంటే కూడా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు బాగా వైరల్ అయింది.
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా గంభీర్ సక్సెస్ అవడం తెలిసిందే. కేకేఆర్ కప్పు కొట్టడంతో అతడి పేరు మరోమారు మార్మోగింది. క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత గౌతీతో బీసీసీఐ సెక్రెటరీ జైషా చాలా సేపు సంభాషించడం, ఇద్దరూ నవ్వుతూ కనిపించడంతో టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ నియామకం ఖరారైనట్లేనని వార్తలు వచ్చాయి. అయితే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. గత కొన్ని వారాలుగా అందరూ టీ20 వరల్డ్ కప్‌తో బిజీ అయిపోవడంతో కోచ్ సెలెక్షన్ గురించి అందరూ మర్చిపోయారు. ఈ తరుణంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం భారత కోచ్‌గా గంభీర్‌ను బోర్డు ఫైనలైజ్ చేసిందని తెలుస్తోంది. జూన్ నెల చివరి వారంలో గౌతీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
కోచ్‌గా గంభీర్ రాకకు ముమూర్తం ఫిక్స్ అయిందని.. ఈ నెల చివర్లో అతడి పేరును బీసీసీఐ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత జట్టు కోచింగ్ బాధ్యతల్ని అతడు చేపడతాడని టాక్ నడుస్తోంది. టీమ్‌ను నడిపించడంలో అవసరమైన సపోర్ట్ స్టాఫ్, బౌలింగ్ కోచ్‌తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను కూడా సెలెక్ట్ చేసే బాధ్యతల్ని గంభీర్‌కు అప్పగించారని తెలుస్తోంది. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి అతడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడని కొందరు అనలిస్ట్‌లు అంటున్నారు. నేషనల్ టీమ్‌కు సేవలు అందించాలనే ఉద్దేశంతో కేకేఆర్‌ను గంభీర్ వీడాడని.. ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ ఇచ్చిన భారీ ఆఫర్‌ను అతడు వద్దన్నాడని చెబుతున్నారు. అయితే గంభీర్ నియామకంపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ చెప్పలేం.
BCCI is set to announce Gautam Gambhir as Team India Head Coach by the end of this Week.
Gambhir will select his support staff, which included bowling Coach,batting Coach and fielding Coach. pic.twitter.com/LI2LHG1Avm
— Sujeet Suman (@sujeetsuman1991) June 16, 2024