iDreamPost

టీమిండియా ప్లేయర్లకు BCCI స్ట్రాంగ్ వార్నింగ్.. వారికి నోటీసులు!

BCCI Strong Warning To Team India Players: గత కొంత కాలంగా టీమిండియాలోని కొంత మంది ప్లేయర్లకు బీసీసీఐకు మధ్య ఇన్ డైరెక్ట్ వార్ జరుగుతోంది. దీంతో సదరు ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది BCCI. మాట వినకపోతే.. నోటీసులు కూడా అందుతాయి అంటూ హెచ్చరించింది.

BCCI Strong Warning To Team India Players: గత కొంత కాలంగా టీమిండియాలోని కొంత మంది ప్లేయర్లకు బీసీసీఐకు మధ్య ఇన్ డైరెక్ట్ వార్ జరుగుతోంది. దీంతో సదరు ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది BCCI. మాట వినకపోతే.. నోటీసులు కూడా అందుతాయి అంటూ హెచ్చరించింది.

టీమిండియా ప్లేయర్లకు BCCI స్ట్రాంగ్ వార్నింగ్.. వారికి నోటీసులు!

టీమిండియా క్రికెట్ లో గత కొంత కాలంగా తీవ్ర అనిశ్చితి నెలకొంది. అది నివురుగప్పిన నిప్పులా రాజుకుంటోంది. ఆ విషయాన్ని ముందునుంచి చూస్తూ వస్తూనే ఉంది బీసీసీఐ. ప్లేయర్లు మారుతారని వారికి కొన్ని అవకాశాలు కూడా ఇచ్చింది. కానీ బీసీసీఐ మాటలను వారు ఏమాత్రం లెక్కచేసినట్లు కనిపించడం లేదు. దీంతో ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆ ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో పాల్గొనాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరి ఆ ఆటగాళ్లు ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు దేశవాలీ క్రికెట్ కాదని, రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ప్రాక్టీస్ మెుదలుపెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పైగా ఇషాన్ కిషన్ ఎపిసోడ్ తో బీసీసీఐ సీరియస్ గా ఉంది. దీంతో పరిస్థితి చేయిదాటిపోకముందే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి కొరడాఝుళిపించింది. దేశవాలీ క్రికెట్ ను కాదని ఐపీఎల్ సన్నాహక మ్యాచ్ ల్లో ఆడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అలాంటి ఆటగాళ్లకు త్వరలోనే నోటీసులు అందుతాయని బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

జాతీయ జట్టు ఆటగాళ్లు, గాయాల బారిన పడిన ప్లేయర్లు మినహా మిగిలిన అందరూ రంజీల్లో తప్పకుండా ఆడాలని బీసీసీఐ స్ఫష్టం చేసింది. మా మాటలను లెక్కచేయకుండా ఉండే వాళ్లకు త్వరలోనే నోటీసులు అందుతాయని, అలా నోటీసులు అందుకున్న ప్లేయర్లపై తీవ్ర చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ఇషాన్ కిషన్ తో పాటుగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అతడి సోదరుడు కృనాల్ పాండ్యా ముగ్గురు కలిసి బరోడాలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాప్ లో పాల్గొంటున్నారు.

దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ పెద్దలు వారికి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితమే టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ సైతం రంజీల్లో ఆడాలని ఇషాన్ కిషన్ తో పాటుగా మరికొందరికి సలహాలు ఇచ్చాడు. కానీ ఆ మాటలను అతడు లెక్కచేయనట్లుగానే కనిపిస్తోంది. కాగా.. జితేశ్ శర్మను జట్టులోకి తీసుకోవడంతో.. ఇషాన్ కిషన్-బీసీసీఐ మధ్య ఇన్ డైరెక్ట్ వార్ జరుగుతోందని తెలుస్తోంది. మరి బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందా? ఆ మ్యాచ్ చుట్టూ అనుమానాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి