iDreamPost

టీమిండియాపై గంభీర్ పెత్తనం.. అంతా జైషా సపోర్ట్​తోనే?

  • Published Jun 18, 2024 | 2:00 PMUpdated Jun 18, 2024 | 2:00 PM

భారత జట్టుకు నయా హెడ్ కోచ్​గా గౌతం గంభీర్ రాక దాదాపుగా ఖాయమైంది. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా క్రికెట్ వర్గాలు అతడే కోచ్ అని అంటున్నాయి.

భారత జట్టుకు నయా హెడ్ కోచ్​గా గౌతం గంభీర్ రాక దాదాపుగా ఖాయమైంది. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా క్రికెట్ వర్గాలు అతడే కోచ్ అని అంటున్నాయి.

  • Published Jun 18, 2024 | 2:00 PMUpdated Jun 18, 2024 | 2:00 PM
టీమిండియాపై గంభీర్ పెత్తనం.. అంతా జైషా సపోర్ట్​తోనే?

టీమిండియా నయా హెడ్ కోచ్​గా ఎవరు వస్తారనే అంశంపై భారత క్రికెట్ బోర్డు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పొట్టి కప్పు తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడు. దీంతో కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది బోర్డు. కోచ్ పోస్ట్​ మీద ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవాలంటూ ప్రకటన చేసింది. ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారనేది ఇంకా తెలియదు. కోచ్​ రేసులో రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి విదేశీ దిగ్గజాల పేర్లు బాగా వినిపించాయి. అయితే వీళ్లెవరూ కాదని.. టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ వైపే బోర్డు మొగ్గు చూపుతోందని తెలిసింది. కోచ్​గా గౌతీ పేరు దాదాపుగా ఖాయమైందని.. జూన్ చివరి వారంలో దీనిపై అఫీషియల్ అనౌన్స్​మెంట్ రానుందని క్రికెట్ వర్గాల సమాచారం.

గంభీర్​కు ఇవాళ బీసీసీఐ ఇంటర్వ్యూ నిర్వహించనుందని వినికిడి. అయితే ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా కోచ్​గా అతడ్ని ఫిక్స్ చేశారని, ఇదంతా నామమాత్రపు ప్రక్రియ అని రూమర్స్ వస్తున్నాయి. ఈ తరుణంలోనే గంభీర్​కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఇక మీదట టీమిండియాలో గౌతీ డామినేషన్ నడవనుందట. సాధారణంగా కొత్త కోచ్ నియామకం టైమ్​లో అవసరమైతే తప్ప మిగతా స్టాఫ్​ను మార్చరు. పదవీకాలం ముగిస్తే తప్ప అలాంటి డెసిషన్స్ తీసుకోరు. కానీ గంభీర్ రాకతో భారత క్రికెట్​లో ప్రక్షాళన జరగనుందట. హెడ్ కోచ్​ సహా మిగతా స్టాఫ్ మొత్తాన్ని మార్చేయనున్నారని సమాచారం. బ్యాటింగ్ కోచ్​తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచెస్, సపోర్ట్ స్టాఫ్​ను ఎంచుకునే స్వేచ్ఛను గౌతీకి బోర్డు ఇచ్చిందని టాక్ నడుస్తోంది.

గంభీర్ రాకతో టీమిండియాలో నయా మేనేజ్​మెంట్​ కొలువుదీరనుందని తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్​గా తనకు నచ్చిన వారిని గౌతీ సెలెక్ట్ చేస్తున్నాడని.. ఇంకా టీమ్​లోకి రాకముందే అతడి పెత్తనం మొదలైందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగానే ఐపీఎల్​లో లక్నో సూపర్ జియాంట్స్​ ఫ్రాంచైజీలో తనతో కలసి పనిచేసిన జాంటీ రోడ్స్​ను భారత కొత్త ఫీల్డింగ్​ కోచ్​గా తీసుకోవాలని బీసీసీఐకి గౌతీ రిఫర్ చేశాడని చెబుతున్నారు. బోర్డు సెక్రెటరీ జైషా అండతో తనకు నచ్చిన వారిని మేనేజ్​మెంట్​లో ఉండేలా గంభీర్ చూసుకుంటున్నాడని వినిపిస్తోంది. ఇక మీదట జట్టులో గౌతీ డామినేషన్ షురూ అవనుందని, పొట్టి కప్పు తర్వాత భారత క్రికెట్​లో మరిన్ని అనూహ్య మార్పులు తథ్యం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. టీమిండియా కోచ్​గా బాధ్యతలు చేపట్టక ముందే గౌతీ హవా మొదలవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి