iDreamPost

Barrelakka: ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం.. బర్రెలక్కకి వచ్చే ఓట్లు ఎన్నంటే!

నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి బర్రెలక్క అలియాస్ శిరీషా దిగిన సంగతి తెలిసిందే. ఆమె గెలుపుపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఎన్ని ఓట్లు వస్తాయనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్, వివిధ సంస్థలు అంచనా వేశాయి.

నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి బర్రెలక్క అలియాస్ శిరీషా దిగిన సంగతి తెలిసిందే. ఆమె గెలుపుపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఎన్ని ఓట్లు వస్తాయనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్, వివిధ సంస్థలు అంచనా వేశాయి.

Barrelakka: ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం.. బర్రెలక్కకి వచ్చే ఓట్లు ఎన్నంటే!

గురువారం జరిగిన పోలింగ్ తో  తెలంగాణ ఎన్నికల సమరం ముగిసింది. అలానే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా విడుదల చేశాయి. అయితే కొన్ని సంస్థలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా, మరికొన్ని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. మొత్తానికి తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక పలు చోట్ల టక్ ఆఫ్ వార్ నడుస్తోంది. అయితే గెలుపుపై ఎవరి ధీమాతో వాళ్లు ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచిన అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీషా. ఈమె అతి తక్కువ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇక తాజాగా  విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం.. బర్రెలక్కకి పడిన ఓట్లు ఎన్ని?.  ఆవివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గురువారం తెలంగాణలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. నెల రోజుల పాటు సాగిన హోరాహోరీ ప్రచారం, నేతల పనితనంతో గురువారం ఓటర్లు తమ తీర్పును ఈవీఎం మెషీన్లలో నిక్షిప్తం చేశారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఎంత ఓటింగ్ శాతం వస్తుందన్నది  పలు ప్రముఖ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ సర్వే ద్వారా ఓ అంచనా వేశాయి. ఈ ఫలితాలు అందరిలో ఆసక్తిని కలిగించాయి. వీటన్నిటి కంటే బర్రెలక్క కు వచ్చే ఓట్లపై అందరిలో ఆసక్తి  నెలకొంది.

నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి బర్రెలక్క అలియాస్ శిరీషా దిగిన సంగతి తెలిసిందే. ఈమె నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానంటూ తీసిన వీడియోతో వార్తల్లోకి ఎక్కింది. ఇక ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగింది.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క గెలుపుపై ఆసక్తికర వాదన వినిపిస్తోంది. నిజానికి ఆమె స్వతంత్ర అభ్యర్థి కన్నా.. బీఎస్పీ తరఫున పోటీ చేసి ఉంటే మరిన్ని ఓట్లు పడేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వే, పలు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం శిరీషాకు పది వేల నుంచి 15 వేల వరకు ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుసుతోంది. అయితే ఆమెకు పడిన ఓట్ల కారణంగా ఎవరి గెలుపు అవకాశాలకు గండి కొడుతుందో అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

బర్రెలక్క ఓట్లు అధికార పార్టీ అభ్యర్థిని దెబ్బ తీస్తుందా, ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థిని దెబ్బ తీస్తుందా అనే ప్రశ్నలు  ఉత్పన్నమవుతున్నాయి. 2018 ఎన్నికల్లో కూడా అప్పటి బీఆర్ఎస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణా రావుపై కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కేవలం 12,546 ఓట్లతో విజయం సాధించారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావుకు 13,156 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

సుధాకర్ రావు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ప్రభావం చూపించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. 2023 ఎన్నికల్లో అనూహ్యంగా బర్రెలక్క బరిలోకి దిగగా.. ఆమెకు 10 నుంచి 15 వేల ఓట్లు రావటమంటే… ఎవరి గెలుపుకు గండికొడుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి. మరి.. బర్రెలక్కకు 10 నుంచి 15 వేల ఓట్లు వస్తాయని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి