Somesekhar
నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్ సూపర్ 8 కు వెళ్లడమే కాకుండా.. 17 ఏళ్ల పొట్టి ప్రపంచ కప్ లో సరికొత్త చరిత్ర నెలకొల్పింది.
నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్ సూపర్ 8 కు వెళ్లడమే కాకుండా.. 17 ఏళ్ల పొట్టి ప్రపంచ కప్ లో సరికొత్త చరిత్ర నెలకొల్పింది.
Somesekhar
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన విజయాన్ని సాధించింది బంగ్లాదేశ్. సెయింట్ లూసియా వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో గెలిచి.. సూపర్ 8కు అర్హత సాధించింది. ఇక ఈ విజయం ద్వారా 17 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సరికొత్త ఘనతను తన పేరిట లిఖించుకుంది బంగ్లాదేశ్. ఈ క్రమంలోనే ఈ రికార్డ్ సాధించిన తొలి టీమ్ గా నిలిచి.. ఔరా అనిపించింది. మరి 17 ఏళ్ల పొట్టి ప్రపంచ కప్ లో బంగ్లా సాధించిన ఆ రికార్డు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ సూపర్ 8కు చేరింది. కీలకమైన మ్యాచ్ లో నేపాల్ పై 21 రన్స్ తో గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 19.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షకీబ్ 17 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో సోంపాల్, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడెల్, లామిచానే తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 107 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఛేదించే క్రమంలో 19.2 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. జట్టులో కౌషల్ మల్లా 27 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలవగా.. పేసర్ తంజిమ్ హసన్ 4, ముస్తాఫిజుర్ రెహ్మన్ 3 వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించారు.
ఇక ఈ విజయంతో 17 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రను తిరగరాసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి టీమ్ గా బంగ్లాదేశ్ రికార్డ్ నెలకొల్పింది. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే? వరల్డ్ కప్ చరిత్రలో అత్యల్ప స్కోర్ ను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది బంగ్లా టీమ్. 107 పరుగులను కాపాడుకుని ఈ ఘనత సాధించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. ఈ వరల్డ్ కప్ లోనే సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 113 పరుగుల టార్గెట్ ను కాపాడుకుంది. ఈ రికార్డ్ ను తాజాగా బంగ్లానే బద్దలు కొట్టడం ఇక్కడ కొసమెరుపు. మరి 17 ఏళ్ల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో బంగ్లాదేశ్ ఈ రికార్డ్ ను సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.