iDreamPost

రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు.. నటి హేమ కామెంట్స్!

  • Published May 20, 2024 | 12:24 PMUpdated May 20, 2024 | 12:49 PM

Actress Hema Comments: ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై కొన్ని వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొంది అంటూ వార్తలు వచ్చాయి.. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.

Actress Hema Comments: ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై కొన్ని వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొంది అంటూ వార్తలు వచ్చాయి.. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.

  • Published May 20, 2024 | 12:24 PMUpdated May 20, 2024 | 12:49 PM
రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు.. నటి హేమ కామెంట్స్!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొన్ని వార్తలు నిముషాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. బతికి ఉన్నా.. చనిపోయిన్నట్లు.. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నట్లు ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. వీటిపై సదరు సెలబ్రెటీలు స్పందించి ఆ వార్తలను ఖండిస్తునారు. తాజాగా బెంగుళూరు లోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్ హౌజ్ లో ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరిగింది. రేవ్ పార్టీ విషయం గురించి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో హఠాత్తుగా రైడ్ చేశారు. ఈ రైడ్ లో 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో తెలుగు సినీ నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు రావడంతో ఆమె ఆ వార్త క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీల తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాలు సృష్టిస్తుంది. హైదరాబాద్ కి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తన పుట్టిన రోజు వేడుక సందర్భంగా లక్షలు ఖర్చు పెట్టి భారీ ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ రాజకీయ నేతలు, సినీ తారలు, టెక్కీలు, మోడల్స్ పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ రేవ్ పార్టీ జీఆర్ ఫామ్ హౌజ్ లో జరిగింది. జీఆర్ ఫామ్ హౌజ్ హైదరాబాద్ కి చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించినదిగా పోలీసులు తెలిపారు. రైడ్ సందర్భంగా 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 25 మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ రేవ్ పార్టీలో ప్రముఖ నటి హేమ ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ దాడుల్లో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ ను లభించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై నటి హేమ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ఉదయం నుంచి వరుసగా కాల్స్ వస్తున్నాయి.  బెంగుళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి.అవన్నీ పుకార్లు.. నమ్మొద్దు. నాకు రేవ్ పార్టీతో సంబంధం లేదు.  నేను హైదరాబాద్ ఫామ్ హౌజ్ లో ఉన్నా.. బెంగుళూరు ఫామ్ హౌజ్ లో కాదు.   ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకు వస్తాయో అస్సలు అర్థం కావడం లేదు. అనవసరంగా ఇందులోకి నన్ను లాగుతున్నారు. దయచేసి ఇలాంటి వార్తలు అస్సలు నమ్మొద్దు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి