iDreamPost
android-app
ios-app

మగాళ్లే ఆమె టార్గెట్‌.. అందంతో ఎరవేసి.. ఇంటికి ఆహ్వానించి..

మగాళ్లే ఆమె టార్గెట్‌.. అందంతో ఎరవేసి.. ఇంటికి ఆహ్వానించి..

దేశంలో హనీట్రాప్‌ వ్యవహారాలు ఎక్కువయిపోయాయి. నిత్యం పదుల సంఖ్యలో హనీట్రాప్‌ ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, బెంగళూరులో ముంబై మోడల్‌ హనీట్రాప్‌ వ్యవహారం బయటపడింది. సదరు ముంబై మోడల్‌ తన అందంతో మగాళ్లకు ఎరవేసి లక్షలు దోచేసింది. నైస్‌గా ఇంటికి పిలిచి, బికినీతో వారికి ఇంట్లోకి స్వాగతం పలికి.. వారి కొంపముంచింది. చివరి‍కి పాపం పండి పోలీసులకు చిక్కింది. పోలీసులు ఆమెతో పాటు ఆమె గ్యాంగులోని వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ప్రకాశ్‌ బళిగెర, అబ్ధుల్‌ ఖాదర్‌, యాసిన్‌ అనే ముగ్గురు వ్యక్తులు ఓ గ్యాంగుగా ఏర్పడ్డారు. ముంబైకి చెందిన మెహర్‌ అనే మోడల్‌ను తమ గ్యాంగులో చేర్చుకుని హనీట్రాప్‌కు తెరతీశారు. సోషల్‌ మీడియా ద్వారా స్నేహ అలియాస్‌ మెహర్‌ మగాళ్లను ఆకర్షించేది. తన బుట్టలో పడ్డ మగాళ్లతో బాగా పరిచయం పెంచుకునేది. వాళ్లు ఆమెను పూర్తిగా నమ్మటం మొదలుపెట్టిన తర్వాత బెంగళూరు, జేపీ నగర్‌లోని ఇంటికి ఆహ్వానించేది.

వాళ్లు ఆ ఇంటికి వెళ్లగానే.. బికినీతో వారిని ఇంటి లోపలికి ఆహ్వానించేది. లోపలికి వెళ్లగానే వారిని గట్టిగా హత్తుకునేది. ఇక, ఆ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యేవి. కొద్దిసేపటి తర్వాత విలన్స్‌ ఎంట్రీ ఇచ్చేవారు. సీసీటీవీల్లో రికార్డయిన దృశ్యాలను అడ్డం పెట్టుకుని సదరు బాధితులను బెదిరించేవారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను బాధితుల స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపుతామనేవారు. డబ్బులు ఇవ్వకపోతే స్నేహను పెళ్లి చేసుకోమనే వారు. ఆమెను పెళ్లి చేసుకుని ఆమె మతంలోకి మారమనే వారు.

దీంతో బాధితులు డబ్బులు ఇవ్వటానికి ఒప్పుకునేవారు. వీరి అరాచకాలు రోజు రోజుకు పెరుగుతూపోయాయి. దాదాపు 14 పైగా మందిని వీరు మోసం చేశారు. వారి వద్ద నుంచి 30 లక్షల రూపాయలకు పైగా దోచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి వీరిపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాంగు సభ్యులను బెంగళూరులో.. మోడల్‌ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.