iDreamPost
android-app
ios-app

విషాదం: సిలిండర్ పేలి ఇద్దరు పిల్లల తల్లి మృతి!

  • Published Sep 23, 2023 | 7:14 PM Updated Updated Sep 23, 2023 | 7:14 PM
  • Published Sep 23, 2023 | 7:14 PMUpdated Sep 23, 2023 | 7:14 PM
విషాదం: సిలిండర్ పేలి ఇద్దరు పిల్లల తల్లి మృతి!

బెంగుళూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఇంట్లో సిలిండర్ పేలి ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు వెంటనే స్పందించి ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆ మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది.

స్థానికుల కథనం ప్రకారం.. బెంగుళూరు మారతహళ్లి పరిధిలోని వసంత నగర్ ప్రాంతంలో సెల్వ నాయక్ (54)-సుధారాణి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 17న దంపతులు ఇంట్లో ఉండగా హఠాత్తుగా వంట సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి నలుగురిని ఓ ఆస్పత్రికి తరలించారు. పిల్లలు ఇద్దరు డిశ్చార్ అయ్యారు.

కానీ, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సుధారాణి తాజాగా ప్రాణాలు కోల్పోయింది. భర్త సెల్వా నాయక్ మాత్రం ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నారు. సుధారాణి చనిపోవడంతో వారి పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. సిలిండర్ పేలి చనిపోయిన సుధారాణి మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio