iDreamPost
android-app
ios-app

పరీక్ష కోసమని సౌందర్య బెంగుళూరు వెళ్లింది. పాపం, భర్త కళ్లముందే..!

ఈ మహిళ పేరు సౌందర్య. ఆదివారం పరీక్షలు ఉండడంతో బెంగుళూరు బయలు దేరింది. కానీ, ఉన్నట్టుండి ఆదివారం తెల్లవారు జామును ఆమె భర్త కళ్లముందే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

ఈ మహిళ పేరు సౌందర్య. ఆదివారం పరీక్షలు ఉండడంతో బెంగుళూరు బయలు దేరింది. కానీ, ఉన్నట్టుండి ఆదివారం తెల్లవారు జామును ఆమె భర్త కళ్లముందే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పరీక్ష కోసమని సౌందర్య బెంగుళూరు వెళ్లింది. పాపం, భర్త కళ్లముందే..!

తమిళనాడుకు చెందిన సౌందర్య ఇటీవల డిప్లొమా పరీక్షలు ఉండడంతో తన భర్తతో పాటు కూతురిని తీసుకుని బెంగుళూరు వెళ్లింది. ఇక ఆ రోజు అక్కడే ఉన్న తన తల్లిదండ్రులకు ఇంటికి వెళ్లాలనుకుంది. ఇందులో భాగంగానే ఆదివారం తెల్లవారు జామున రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ మహిళ రోడ్డుపై వెళ్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ఈ ఘటనతో ఆమె భర్త, తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని ఊటీలో సంతోష్-సౌందర్య (23) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సుభిక్ష లియా (9 నెలలు) అనే కూతురు ఉంది. అయితే భర్త ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండగా, భార్య మాత్రం కూతురుని చూసుకుంటూ ఇంటి వద్దే ఉంటుంది. ఇదిలా ఉంటే.. సౌందర్య ఆదివారం డిప్లొమా పరీక్షలు రాయాల్సి ఉంది. ఇందుకోసం తన భర్త, కూతురితో కలిసి శనివారం రాత్రి బెంగుళూరుకు బయలు దేరారు. మరుసటి రోజు తెల్లవారుజామున వీళ్లు అక్కడికి చేరుకున్నారు. ఇక ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ దంపతులు హోప్ ఫార్మ్ కూడలి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడే రోడ్డుపై కరెంట్ తీగ పడిపోయి ఉంది. అయితే కాస్త చీకటి కావడంతో సౌందర్య ఆ వైర్ ను చూడకుండా దానిపై నుంచి దాటింది. ఈ ప్రమాదంలో ఈ మహిళ, ఆమె కూతురు కరెంట్ షాక్ కు గురయ్యారు.

దీంతో మంటలు వచ్చి తల్లి, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఆమె భర్త సంతోష్ కళ్లముందే క్షణాల్లో జరిగిపోవడంతో ఆ సమయంలో ఏం జరిగిందో అర్థం కాక అతడు గుండెలు పగిలేలా ఏడ్చారు. అదే సమయంలో అక్కడికి అందరూ చేరుకున్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. ఆ తర్వాత కాలిపోయిన ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, ఆమె భర్త సంతోష్ శోక సంద్రంలో మునిగిపోయారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పరీక్షల కోసమని వెళ్లిన సౌందర్య చివరికి శవమై కనిపించడంతో అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet