Venkateswarlu
Venkateswarlu
మహిళలతో చనువు ఓ వృద్ధుడి కొంప ముంచింది. ఓ ఇద్దరు మహిళలు ఆ వృద్ధుడ్ని దారుణంగా మోసం చేశారు. వలపు వల వేసి భారీగా డబ్బు కొట్టేశారు. దాదాపు 82 లక్షల రూపాయలు దోచేశారు. తీరా అసలు విషయం తెలిసి ఆ వృద్ధుడు గొల్లుమన్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాధిత వృద్ధుడు తెలిపిన వివరాల మేరకు.. మల్లన్న అనే 60 ఏళ్ల వృద్ధుడు బెంగళూరులోని శ్రీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. మల్లన్న మిత్రుడు ఒకడు ఏప్రిల్ నెలలో ఓ యువతిని అతడికి పరిచయం చేశాడు.
ఆమె పేరు అమ్మన్న అని.. ఆమె కుమారుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని.. కొంత ఆర్థిక సాయం చేయాలని అన్నాడు. ఓ రోజు అమ్మన్న.. మల్లన్న ఓ హోటల్లో కలిశారు. మల్లన్న.. అన్నమ్మకు 5 వేల రూపాయలు సాయం చేశాడు. తర్వాతినుంచి వీరి మధ్య చనువు పెరిగింది. దీంతో ఆ మహిళ మల్లన్న దగ్గరినుంచి తరచుగా డబ్బులు తీసుకోసాగింది. ఓ రోజు అన్నమ్మ.. మల్లన్నను హోటల్‌కు రమ్మని పిలిచింది. ఇద్దరూ కొన్ని గంటల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత అన్నమ్మ తన మిత్రురాలు స్నేహను పరిచయం చేసింది.
ఆమె కూడా మల్లన్న దగ్గరినుంచి డబ్బులు తీసుకోవటం మొదలెట్టింది. ఇద్దరూ కొన్ని సార్లు ఏకాంతంగా కలిశారు. వాటిని ఆమె వీడియోలు కూడా తీసి పెట్టింది. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టింది. ఈమెతో పాటు అన్నమ్మకు కూడా అతడ్ని బ్లాక్ మెయిల్ చేయసాగింది. దీంతో మల్లన్న దాదాపు 82 లక్షల రూపాయలు డ్రా చేసి స్నేహ, అన్నమ్మకు ఇచ్చాడు. డబ్బు ఇచ్చిన సంగతి ఎవరికైనా చెబితే.. రేప్ కేసు పెడతానని అన్నారు. అయితే, వీరి వేధింపులు అంతటితో ఆగలేదు.
మల్లన్న నుంచి 42 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో వీరి వేధింపులు భరించలేకపోయిన మల్లన్న పోలీసులను ఆశ్రయించాడు. ఇద్దరిపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్నేహ, అన్నమ్మతో పాటు స్నేహ భర్త 26 ఏళ్ల లోకేష్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.