iDreamPost

బండ్ల గణేశ్ కి జేజేలు పలుకుతున్న కాంగ్రెస్ శ్రేణులు!

Bandla Ganeshs, TS Election Result 2023: నటుడు, నిర్మాత, రాజకీయ నేత బండ్ల గణేష్ కాంగ్రెస్ విజయం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Bandla Ganeshs, TS Election Result 2023: నటుడు, నిర్మాత, రాజకీయ నేత బండ్ల గణేష్ కాంగ్రెస్ విజయం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బండ్ల గణేశ్ కి జేజేలు పలుకుతున్న కాంగ్రెస్ శ్రేణులు!

తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బుల్లితెరపై నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. వెండితెరపై తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అనూహ్యంగా ప్రొడ్యూసర్ అవతారమెత్తిన బండ్ల గణేష్ పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. కరోనా సమయంలో ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఆ మద్య మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీలో కనిపించారు. నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చాటుకున్నారు బండ్ల గణేశ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ హల్ చల్ చేస్తుంటారు బండ్ల గణేష్. 2018 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

బండ్ల గణేష్ ఏది చేసినా ఒక సంచలనమే అంటారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పై ఎక్కితే ఆయన చేసే వ్యాఖ్యలు కొంతకాలం పాటు వైరల్ అవుతుంటాయి. నటుడిగా, నిర్మాత, వ్యాపారిగా, రాజకీయ నేతగా బండ్ల గణేష్ గత ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం కావడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు జేజేలు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ 2018 లో ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బల్ల గుద్ది మరీ చెప్పాడు. ఒకవేళ కాంగ్రెస్ గెలవకుంటే తన గొంతు కోసుకుంటా అన్నారు. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి.. కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో బండ్ల గణేష్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఊదరగొట్టాయి. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ వైపు స్టాండ్ తీసుకుంటూ వస్తున్నారు. ఈ మద్య మరోసారి కాంగ్రెస్ విజయం గురించి మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాం.. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి, కేబినెట్ భేటీ అయ్యి.. ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేస్తాం.. కాబోయే కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం కోసం డిసెంబర్ 7న సాయంత్రం నుంచే ఎల్బీ స్టేడియంలో పడుకుంటా.. దుప్పట్లు కూడా తీసుకువెళ్తున్నా’ అని అన్నారు.

గత ఎన్నికల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ జోష్యం ఫలించకున్నా.. ఆయన మాత్రం ఎక్కడా తగ్గలేదు. తెలంగాణలో అధికార పార్టీపై ప్రజలకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ వాళ్లకు అండగా ఉంటుంది. కొంతకాలంగా కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఏకమై.. అధికార పార్టీ గద్దె దింపే ప్రయత్నాలు మొదలు పెట్టారని పలు సందర్భాల్లో అన్నారు బండ్ల గణేష్. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, సోనియమ్మ గాంధీ పుట్టిన రోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని అన్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఇప్పుడు బండ్ల గణేష్ పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. బండ్ల జోస్యం ఇప్పుడు ఫలించిందని తెగ మెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి