iDreamPost
android-app
ios-app

వెనక్కి తగ్గిన బండ్ల.. వారి కోరిక మేరకేనట!

వెనక్కి తగ్గిన బండ్ల.. వారి కోరిక మేరకేనట!

సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా చర్చనీయాంశం అవుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బండ్ల గణేష్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆయన మన జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేయగా తాజాగా ఆ నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.. ఇద్దరూ చెరొక ప్యానల్ కూడా ప్రకటించారు.. అయితే ముందు నుంచి బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తూ వచ్చాడు.. అయితే జీవిత రాజశేఖర్, హేమ అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని ప్రకటించడంతో వారిని బుజ్జగించి హేమకు, జీవితా రాజశేఖర్ కు తన ప్యానల్ లోనే పదవులు ప్రకటించాడు ప్రకాష్ రాజ్..

అయితే ముందు నుంచి బండ్ల గణేష్ ఆశిస్తూ వచ్చిన జనరల్ సెక్రటరీ పదవికి జీవిత రాజశేఖర్ పోటీ చేస్తూ ఉండడంతో ఆమె ఉంటే నేను ఆ ప్యానల్ లో ఉండను అంటూ ఆమె మీద పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు బండ్ల గణేష్.. ప్రకటించినట్టుగానే ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మా బిల్డింగ్ అనేది అవసరమే లేదని తాను మాత్రం జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన అయితే మన టాలీవుడ్ హీరోలు అందరినీ నిలబెట్టి ఒక గంట ప్రోగ్రాం చేయించి కోట్లు కూడపెడతాను అని అన్నారు. ఆ కోట్ల రూపాయలతో వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు..

అలాగే ఎవరు ఎవరికి ఓటు వేసుకున్నా ఫర్వాలేదు కానీ జనరల్ సెక్రటరీ ఓటు విషయంలో మాత్రం తనకే వేయాలని బండ్ల ముందు నుంచి కోరుతూ వచ్చారు.. అయితే పరిణామాలు ఏం ఏమేం జరిగాయో ఏమో తెలియదు కానీ ఈ రోజు తాను నామినేషన్ వెనక్కి తీసుకున్నట్లు బండ్ల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేయడంతో ఆయన ప్రకాష్ రాజ్ ప్యానల్ కే మద్దతు పలికే అవకాశం ఉంది. ఇక ‘ఇన్ని రోజులు నాకు సహకరించిన మీడియా సోదరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎప్పుడు మీ ఆశీస్సులు కోరుకుంటానని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అన్ని పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

Also Read : సంక్రాంతికి రావడానికి ‘ఆర్ఆర్ఆర్’ విశ్వప్రయత్నాలు.. అసలు సంగతి ఇదా?

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş