iDreamPost

నిర్మాత బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..!

Bandla Ganesh Driver: ఇటీవల కాలంలో మనుషుల్లో సహనం, ఓర్పు అనేది కరువైంది. అందుకే ప్రతి చిన్న విషయానికి ఆవేశ పడిపోతున్నారు. అంతేకాక క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య దారుణ నిర్ణయం తీసుకుంది.

Bandla Ganesh Driver: ఇటీవల కాలంలో మనుషుల్లో సహనం, ఓర్పు అనేది కరువైంది. అందుకే ప్రతి చిన్న విషయానికి ఆవేశ పడిపోతున్నారు. అంతేకాక క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య దారుణ నిర్ణయం తీసుకుంది.

నిర్మాత బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..!

నేటికాలంలో మనిషిలో సహనం అనేది కరువైంది. అందుకే ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకోవడం లేదా ఎదుటి వ్యక్తిని హత్య చేయడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఆత్మహత్య ఘటనలు బాగా పెరిగాయి. ఇక ఇలాంటి సూసైడ్ కేసుల్లో కొన్నిటి వెనుక ఉన్న కారణాలు చూస్తే.. చాలా సిల్లీగా అనిపిస్తాయి. తల్లిదండ్రులు అరిచారని, కూర సరిపోలేదని, భర్త తిట్టాడని, పరీక్షల్లో పాస్ కాలేదని, టీవీ రిమోట్ విషయంలో గొడవ జరిగి.. ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా చట్నీ విషయంలో దంపతుల మధ్య తలెత్తిన గొడవ చివరకి భార్య ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం గోప తండాకు చెందిన రమణ, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందనకు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అనంతరం వీరిద్దరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం-2లోని ఇందిరానగర్‌ లోని అపార్ట్‌మెంట్‌ లో నివాసం ఉంటున్నారు. రమణ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. చందన భీమా జ్యువెలర్స్  లో సేల్స్ ఉమెన్ గా పని చేస్తుంది. పెళ్లైన కొత్తలో వీరి సంసారం ఎంతో హాయిగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో రమణ దంపతుల మధ్య గొడవ జరిగిందని సమాచారం. 

Bandla Ganesh's car driver's wife committed suicide!

తినే ఆహారంలో చట్నీ ఎక్కువైందని రమణ, భార్యతో గొడవ పడినట్లు తెలుస్తోంది. అనంతరం మరుసటి రోజు సోమవారం ఉదయం రమణ తన విధులకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత చందన పలుమార్లు రమణకు వీడియో కాల్ చేసినా అతను స్పందించలేదని సమాచారం. దీంతో నార్మల్ ఫోన్ కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి పెట్టేసింది.  వెంటనే స్పందించిన రమణ.. తన ఇంటి యజమానికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి తన ఇంటికి వెళ్లి చూడమని కోరాడు. దీంతో ఇంటి యజమాని వెళ్లి చూడగా.. అప్పటికే చందన సూసైడ్ చేసుకుంది.

దీంతో యజమాని వెళ్లి.. చాలా సేపు తలుపు తట్టాడు. ఆమె ఎంత సేపటికి  తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. ఇక చుట్టుపక్కల వారి సాయంతో రమణ ఇంటి యజమాని తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. వారు వెళ్లి చూడగా.. అప్పటికే చందన ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటనపై యజమాని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు..మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బండ్ల గణేష్  డ్రైవర్ రమణను పోలీసులు  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి.. ఇలా ప్రతి సమస్యకు, గొడవకు చావే పరిష్కారంగా భావించే వారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి