iDreamPost

బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం..

బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం..

సినీనటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత నియోజకవర్గమైన హిందూపురం పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. అనేకమంది నిరసనకారులు బాలకృష్ణ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేసారు.

హిందూపూర్ నియోజక వర్గ పర్యటనలో భాగంగా అక్కడకు వెళ్లిన బాలకృష్ణ కాన్వాయ్ ని ఆందోళన కారులు అడ్డుకున్నారు.మూడు రాజధానులను ఎందుకు వ్యతిరేకిస్తున్నావని నిలదీసే ప్రయత్నం చేసారు. రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఎందుకు ఉన్నావంటూ బాలకృష్ణ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బాలకృష్ణ గో బ్యాక్ రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ,రాయలసీమ ద్రోహి గో బ్యాక్.. బాలకృష్ణ గో బ్యాక్ అంటూ నిరసన కారులు నినాదాలు చేసారు.. అమరావతిలో మాత్రమే ఎందుకు అభివృద్ది చెందాలని కోరుకుంటున్నారో చెప్పాలని, రాయలసీమ అభివృద్ధి చెందడం బాలకృష్ణకు ఎందుకు ఇష్టంలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బాలకృష్ణ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. ఆందోళన కారులు కాన్వాయ్ ని అడ్డుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసారు. ఆందోళన కారులను అడ్డుకున్నారు.

కాగా జగన్ సర్కార్ రాజధాని వికేంద్రీకరణను ప్రతిపాదించిన తరువాత రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాజధాని వికేంద్రీకరణతోపాటుగా పలు కీలక బిల్లులను అడ్డుకున్న శాసనమండలిని రద్దు కొరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్ర హోం శాఖ పార్లమెంట్ సెక్రెటరీకి బదిలీ చేసింది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి