iDreamPost

నానితో వేణు రిస్క్ చేయట్లేదు! టైటిల్ తో క్లారిటీ!

బలగం సినిమాతో మంచి హిట్ అందుకున్న వేణు యెల్దండి.. తర్వాత నానితో ఓ మూవీ చేయబోతున్నాడని టాక్. ముఖ్యంగా ఈ మూవీ టైటిల్ తోనే వేణు రిస్క్ చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకు వేణు తీసుకున్న ఆ టైటిల్ ఏంటంటే?

బలగం సినిమాతో మంచి హిట్ అందుకున్న వేణు యెల్దండి.. తర్వాత నానితో ఓ మూవీ చేయబోతున్నాడని టాక్. ముఖ్యంగా ఈ మూవీ టైటిల్ తోనే వేణు రిస్క్ చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకు వేణు తీసుకున్న ఆ టైటిల్ ఏంటంటే?

నానితో వేణు రిస్క్ చేయట్లేదు! టైటిల్ తో క్లారిటీ!

బలగం వేణు.. ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. కమెడియన్ గా కెరియర్ ను మొదలు పెట్టిన బుల్లితెరపై ఎంతోమంది కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత ట్రాక్ మార్చి ఏకంగా బలగం అనే మూవీని తెరకెక్కించి అందరికీ షాకిచ్చాడు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో బలగం వేణు ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ల లీస్టులో చేరిపోయాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంతే కాదు.., ఈ సినిమాకి గాను ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. వేణు ఈ సినిమాని గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కించి తెలంగాణ పల్లె ప్రజల జీవన విధానాన్ని ఎంతో అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు.

ఈ మూవీ అనుకున్న దానికంటే సూపర్ డూపర్ హిట్ గా నిలిచి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. చిన్న చిత్రంగా విడుదలై సరికొత్త రికార్డులను నెలకోల్పింది. ఇక ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే కొందరు రాజకీయ నాయకులు బలగం చిత్రాన్ని గ్రామల్లో తెరలు ఏర్పాటు చేసి ప్రజలను చూపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఏ ఊరిలో చూసిన బలగం సినిమాను ప్రదర్శిస్తూ తెలంగాణ ప్రజలకు దగ్గరై మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఎంతో అద్బుతమైన మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ వేణుకు తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును మూట గట్టుకున్నాడు. అయితే, ఈ మూవీ తర్వాత బలగం వేణు దిల్ రాజ్ బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.

వేణు రాసుకున్న కథను ముందుగా నిర్మాత దిల్ రాజుకు వినిపించాడట. అది నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు దిల్ రాజు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. కాకపోతే, డైరెక్టర్ వేణు ఈ మూవీని కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే విధంగా రాసుకున్నాడని సమాచారం. ఈ చిత్రానికి ఎల్లమ్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడట. ఇదిలా ఉంటే.. వేణు రాసుకున్న ఈ కథకు న్యాచురల్ స్టార్ నాని అయితేనే సరైన న్యాయం చేస్తాడని, అందుకే అతడికి ఈ స్టోరీ లైన్ కూడా వినిపించడంతో అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇకపోతే.. డైరెక్టర్ వేణు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన బలగం సినిమా మాధిరిగానే తన తదుపరి చిత్రమైన ఎల్లమ్మను కూడా అదే జానర్ లో తెరకెక్కించాలనుకుంటున్నాడట.

బలగం హిట్ తర్వాత వేణు కమర్షియల్ సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ, అవేం కాకుండా మళ్లీ అదే జానర్ లో ఎల్లమ్మను చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, కమర్షియల్ మూవీని చేయాల్సింది పోయి మళ్లీ గ్రామీణ వాతావరణంలో సాగే కథనే ఎంచుకోవడం వేణు కాస్త రిస్క్ చేస్తున్నట్లేనని కొందరు సినీ మేధావులు అభిప్రాయపడుతున్నారు. వెంట వెంటనే అదే తరహా జానర్ చిత్రాలు తెరకెక్కించిన ఏ మూవీ కూడా హిట్ అయిన సందర్భాలు లేవు. కానీ, వేణు ఇప్పుడు మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకుని రిస్క్ చేస్తున్నాడని కొందరు వాపోతున్నారు. డైరెక్టర్ వేణు ఎంతో సహజంగా తెరకెక్కించిన బలగం తరహాలోనే ఎల్లమ్మను మూవీని తీసి మరో విజయం సాధిస్తాడా? లేకుంటే రిస్క్ చేసి చేతులు కాల్చుకుంటాడా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదైతైనేం మరో సంచలననానికి అడుగు వేస్తున్న బలగం వేణు మరోసారి హిట్ కొట్టాలని ఆశిద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి