iDreamPost

వాళ్ళని వీళ్ళని ఎందుకు.. లోకేష్ నే పోటీలో పెట్టొచ్చు కదా ??

వాళ్ళని వీళ్ళని ఎందుకు.. లోకేష్ నే పోటీలో పెట్టొచ్చు కదా ??

రాజ్యసభ ఎన్నికల విషయంలో ప్రతిపక్ష నాయకుడు వైఖరిని నిరశిస్తూ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యసభ నామినేషన్లు ప్రక్రియలో భాగంగా వైసిపికి స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభకు పోటీచేస్తున్న అభ్యర్థులకు బి-ఫారం లు ఇస్తున్నారని తెలిసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా.. చంద్రబాబుకు తెలుగుదేశం ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం కూడా లేదని తెలిసినప్పటికీ.. రాజ్యసభలో తెలుగుదేశం తరపున అభ్యర్థులను నిలుపుతామని, వారికి పార్టీ తరుపున బి-ఫారంలు ఇస్తామని చెప్పి అభ్యర్థులను పిలిపించుకోవడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని వల్లభనేని బాలశౌరి ఆరోపించారు.

ఏమాత్రం అవకాశం లేనప్పటికీ చంద్రబాబు రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులకు బి-ఫారం ఇస్తామనడం చూసి ఆ పార్టీ నాయకులు పార్టీ ఆఫీసు దరిదాపుల్లోకి కూడా రాకుండా బయపడి పారిపోతున్నారని బాలశౌరి ఎద్దేవా చేశారు. ఎలాగూ చివరికి తెలుగుదేశం కార్యాలయానికి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తప్ప ఎవరు రావడం లేదు కాబట్టి, వాళ్లకి వీళ్ళకి కాకుండా ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్న చంద్రబాబు కుమార రత్నం నారా లోకేష్ కి ఇచ్చి గెలిపించుకోవచ్చు కదా.. అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ లో ఈ దఫా ఎన్నికలు జరగనున్న 4 స్థానాలకు గాను, మొత్తం నాలుగు స్థానాలను వైసిపి సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి అనుకుంటున్న తరుణంలో ఏమాత్రం అవకాశం లేనప్పటికీ కేవలం రాజకీయ కారణాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు అనూహ్యంగా పార్టీ తరుపున అభ్యర్థులను పోటీలో పెట్టడం పలు విమర్శలకు దారితీసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి