iDreamPost

ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండు రోజులు సెలవులు

ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండు రోజులు సెలవులు రాబోతున్నాయి. ఇవే కాకుండా మరో సెలవు కూడా రాబోతుంది. ఇంతకు ఏ రోజుల్లో సెలవులు వచ్చాయంటే..?

ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండు రోజులు సెలవులు రాబోతున్నాయి. ఇవే కాకుండా మరో సెలవు కూడా రాబోతుంది. ఇంతకు ఏ రోజుల్లో సెలవులు వచ్చాయంటే..?

ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండు రోజులు సెలవులు

ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్.  ఈ నెలలో కొన్ని ప్రభుత్వ సెలవు రాబోతున్నాయి. అందులో ఒకటి బక్రీద్. ఈ పండుగను పురస్కరించుకుని ఈ నెల 17న ప్రభుత్వం హాలీడే డిక్లేర్ చేసింది తెలంగాణ సర్కార్. ఆ రోజు సోమవారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలువులు వచ్చినట్లు అయ్యింది. దీంతో ఎక్కడైనా వెళ్లాలని అనుకునే వారంతా .. ఈ రెండు రోజులు ప్లాన్ చేసుకనే ఉంటారు.ముస్లిం సోదరీ సోదరీమణులకు బక్రీద్ అత్యంత కీలకమైన పండుగ. త్యాగానికి ప్రతీకగా ఈ ఫెస్టివల్ చేసుకుంటారు. ఇప్పటికే సిటీలోని అన్ని మసీదులు, దర్గాలు ముస్తాబయ్యాయి. ఇక పండుగ అంటేనే బంధువులు, చుట్టాలు వస్తుంటారు. మటన్ లేనిదే ముద్ద దిగదు కనుక.. భారీగా పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు మాంసానికి భారీ డిమాండ్ పెరగనుంది.

కానీ ఇప్పుడు ఈ సెలవు రోజును మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. రంజాన్ పండుగ లాగానే బక్రీద్ పండుగ కూడా నెలవంక దర్శనం ఆధారంగానే జరుపుకుంటారు. నెలవంక జూన్ 7న కనిపిస్తే.. జూన్ 17న బక్రీద్ జరుపుకుంటారు. లేదంటే 18న ఫెస్టివల్ జరుపుకునే అవకాశాలున్నాయి. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లో 12వ నెల అయిన దుల్ హిజ్జా 10వ తేదీన బక్రీద్ జరుపుకుంటారు. అప్పుడు.. 17న విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. అలా కాకుండా.. ఆ రోజు సెలవు పెట్టుకుంటే.. వరుసగా మూడు రోజుల సెలవు వచ్చినట్లు అవుతుంది. ఇక హైదరాబాద్ నగరంలో బక్రీద్ హడావుడి అప్పుడే మొదలైంది. అలాగే బక్రీద్ పండుగతో పాటు ఈ నెల జూన్ 25న వచ్చే ఈద్-ఎ-గదీర్‌కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

బక్రీద్ పండుగ కోసం సిటీలోని అన్ని ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్​తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేకలు, గొర్రెలను హైదరాబాద్ నగరానికి  తీసుకొచ్చారు. మెహిదీపట్నం, లంగర్ హౌస్​రింగ్ రోడ్, టోలిచౌకి, జియాగూడ, అంబర్ పేట, కాచిగూడ, చాదర్ ఘాట్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో టెంట్లను ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. గతంలో కంటే ఈసారి భారీ సంఖ్యలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను మార్కెట్లకు తీసుకొచ్చారు. వీటి ధరలకు ఒక్కసారిగా రెక్కలు రానున్నాయి.  ఈ నేపథ్యంలో వేట మాంసాానికి భారీగా డిమాండ్ పెరుగునుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి