iDreamPost
android-app
ios-app

భీకర ఫామ్ లో బాబర్ అజామ్! టీమిండియా జాగ్రత్త పడాలా?

పాక్ ప్లేయర్ బాబర్ అజం బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. న్యూజీలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్ లలో అర్ధసెంచరీలతో రాణించాడు.

పాక్ ప్లేయర్ బాబర్ అజం బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. న్యూజీలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్ లలో అర్ధసెంచరీలతో రాణించాడు.

భీకర ఫామ్ లో బాబర్ అజామ్! టీమిండియా జాగ్రత్త పడాలా?

పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. న్యూజీలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు కివీస్ తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ లలో అర్థ సెంచరీలతో చెలరేగాడు. భీకర ఫామ్ లో ఉన్న బాబర్ ఆజం ఆట తీరు చూస్తుంటే టీమిండియా జాగ్రత్త పడాలేమో అని అనిపిస్తోంది. వన్డే వరల్డ్ కప్ లో పాక్ ఘోరమైన పరాజయాన్ని చవిచూసిన అనంతరం పాక్ బోర్డ్ ప్రక్షాలన చేపట్టింది. ఈ క్రమంలో బాబర్ ఆజం జట్టు కెప్టెన్ నుంచి వైదొలిగాడు. పాక్ జట్టులో చాలా మార్పులు జరిగాయి. కానీ జట్టు ప్రదర్శనలో మాత్రం పెద్దగా తేడా ఏమీ లేదు.

కాగా కివీస్-పాక్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో బాబర్ ఆజం కివీస్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్ లో 35 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. ఇక రెండో మ్యాచ్ లో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు బాబర్ అజం. అతడు ఎదుర్కొన్న 43 బంతుల్లో 66 పరుగులు సాధించి బ్యాటింగ్ తో మెరుపులు కురిపించాడు. ఇక తాజాగా జరిగిన 3వ టీ20లో కూడా భీకరమైన బ్యాటింగ్ తో బాబర్ ఆజం విరుచుకుపడ్డాడు. ఈమ్యాచ్ లో 37 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్స్ తో 58 పరుగులు సాధించి ఔటయ్యాడు. అయితే పాక్ జట్టులో బాబర్ అజం అద్భుతైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ జట్టు మాత్రం వెనకపడిపోతుంది. కివీస్ తో జరిగిన మూడు మ్యాచ్ లలో పాక్ జట్టు ఓటమిపాలైంది.

కాగా ఈ ఏడాది జూన్ నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో బాబర్ అజం భీకరమైన ఫామ్ పై భారత్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఓటమనేది ఎరగకుండా దూసుకెళ్లిన టీమిండియా ఫైనల్స్ లో మాత్రం చతికిల పడింది. బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమై కప్పును చేజార్చుకుంది. అయితే టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాక్ ఢీకొనబోతున్నాయి. ఈనేపథ్యంలో భారత్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తేనే టీ20 వరల్డ్ కప్ లో పాక్ ను మట్టికరింపిచడం పెద్ద కష్టమేమీ కాదు. ఒంటిచేతితో మ్యాచ్ ను గెలిపించే ఆటగాళ్లకు టీమిండియాలో కొదవ లేదు. ఇక టీమిండియా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో టీ 20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్ నేడు జరిగే మూడో మ్యాచ్ లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.