iDreamPost
android-app
ios-app

పుష్ప 2 ఫస్ట్ రివ్యూ గురించి రష్మిక చెప్పేసిందిగా.. ఓ మై గాడ్!

  • Published Nov 14, 2024 | 4:51 PM Updated Updated Nov 14, 2024 | 4:51 PM

Pushpa 2 Updates: ఓ వైపు షూటింగ్, ఓ వైపు ఎడిటింగ్ ఇంకో వైపు డబ్బింగ్.. ఇలా పుష్ప టీం ఆగమేఘాల మీద పని చేస్తుంది. ఈ గ్యాప్ లో రకరకాల గాసిప్స్. మొత్తానికి కనీసం రోజులో ఒకసారైనా పుష్ప గురించి తలుచుకోకుండా ఎవరు ఉండడం లేదు. ఇలా హడావిడిలో ఉంటే రష్మిక మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీ గురించి నెట్టింట చర్చ మొదలైంది.

Pushpa 2 Updates: ఓ వైపు షూటింగ్, ఓ వైపు ఎడిటింగ్ ఇంకో వైపు డబ్బింగ్.. ఇలా పుష్ప టీం ఆగమేఘాల మీద పని చేస్తుంది. ఈ గ్యాప్ లో రకరకాల గాసిప్స్. మొత్తానికి కనీసం రోజులో ఒకసారైనా పుష్ప గురించి తలుచుకోకుండా ఎవరు ఉండడం లేదు. ఇలా హడావిడిలో ఉంటే రష్మిక మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీ గురించి నెట్టింట చర్చ మొదలైంది.

  • Published Nov 14, 2024 | 4:51 PMUpdated Nov 14, 2024 | 4:51 PM
పుష్ప 2 ఫస్ట్ రివ్యూ గురించి రష్మిక చెప్పేసిందిగా.. ఓ మై గాడ్!

పుష్ప 2 సినిమా ఎలా ఉంటుందా .. సుకుమార్ ఎలాంటి కథను చెప్పబోతున్నాడా అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ సినిమా మీద ఉండే అంచనాల గురించి కూడా తెలిసిందే. ఈ అంచనాలను మరింత పెంచాలని టీం ఫిక్స్ అయింది. అందుకోసం నవంబర్ 17న ఈ మూవీ ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ఓ వైపు షూటింగ్, ఓ వైపు ఎడిటింగ్ ఇంకో వైపు డబ్బింగ్.. ఇలా పుష్ప టీం ఆగమేఘాల మీద పని చేస్తుంది. ఈ గ్యాప్ లో రకరకాల గాసిప్స్. మొత్తానికి కనీసం రోజులో ఒకసారైనా పుష్ప గురించి తలుచుకోకుండా ఎవరు ఉండడం లేదు. ఈ రేంజ్ బజ్ క్రియేట్ చేయడం కేవలం పుష్ప కే సాధ్యం అనిపించుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు సంగీత దర్శకులు రంగంలోకి దిగారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు.. తమన్, అజనీష్ , శామ్ వంటి వారు ఆర్ఆర్ఆర్ చూసుకుంటున్నారు. ఈ ముగ్గురు కలిసి పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ పనులను కంప్లీట్ చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఇవన్నీ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనీ మూవీ టీం భావిస్తుంది. అందుకే మూవీ టీం పార్ట్స్ గా విడిపోయి పనులు చేస్తున్నారట.

ఇలా హడావిడిలో ఉంటే రష్మిక మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీ గురించి నెట్టింట చర్చ మొదలైంది. మూవీ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పింది. అలాగే తాను ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తి చేశానని.. అది అదిరిపోయిందని.. ఓ మై గాడ్ అంటూ చెప్పేసింది. అలాగే సెకండ్ ఆఫ్ అంతకుమించి ఉంటుందని కూడా హింట్ ఇచ్చింది. అటు అల్లు అర్జున్ డబ్బింగ్ చెబుతూనే.. షూటింగ్ లో పాల్గొంటున్నాడట. దీనిని బట్టి చూస్తే సినిమా ప్రేక్షకులు అనుకున్న విధంగానే ఉంటుందేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒక్కో అప్డేట్ ఒక్కో విధంగా ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. మరి రష్మికకు అనిపించినట్లే ప్రేక్షకులకు కూడా అనిపిస్తుందా లేదా అనేది చూడాలి. ఇవన్నీ తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆరోజు ఏమౌతుందా.. మొదటి రోజు ఎలాంటి రికార్డ్స్ నమోదు అవుతాయా.. అని అభిమానులంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు.

ఏదేమైనా ఈ సినిమా కోసం వెయిట్ చేసినట్లు ప్రేక్షకులు మరే సినిమా కోసం వెయిట్ చేసి ఉండరేమో. ఎందుకంటే పార్ట్ 1 చేసిన మ్యాజిక్ అలాంటిది. అందుకోసమే సుకుమార్ ఈసారి పార్ట్ 2 లోని ప్రతి ఫ్రేమ్ ను మరింత శ్రద్దగా తీర్చుదిద్దుతున్నాడు. షూటింగ్ వర్క్స్ లేట్ అయితే అయ్యాయి కానీ.. రిజల్ట్ మాత్రం అదిరిపోయే లెవెల్ లో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అయితే అంచనాలు బాగానే ఉన్నాయి . ఇక రిలీజ్ తర్వాత కూడా ఇదే అంచనాలు కొనసాగితే మాత్రం అనుకున్న వసూళ్లు వచ్చేస్తాయి. ఇక ఇరవై రోజుల్లో ట్రైలర్ , ఐటెం సాంగ్స్ లాంటి అప్డేట్స్ ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet