iDreamPost

తిరుమలలో అద్భుతం! ఈ భక్తురాలినే శ్రీనివాసుడే కాపాడాడు!

తిరుపతిలో నెలవై ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు నిత్యం ఇక్కడకు వస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో.. ఏదైనా పోయినా, దొంగతనానికి గురైనా దొరకడం చాలా కష్టం. అలా దొరికితే.. దేవుడి మహిమే..

తిరుపతిలో నెలవై ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు నిత్యం ఇక్కడకు వస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో.. ఏదైనా పోయినా, దొంగతనానికి గురైనా దొరకడం చాలా కష్టం. అలా దొరికితే.. దేవుడి మహిమే..

తిరుమలలో అద్భుతం! ఈ భక్తురాలినే శ్రీనివాసుడే కాపాడాడు!

తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుండే కాదూ.. దేశ నలుమూలల నుండి, విదేశీ పర్యాటకులు కూడా వెంకటేశ్వరుడిని సందర్శిస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే భగవంతుడిగా, ఆపద మొక్కుల వాడిగా ఆయన్ను కొలుస్తుంటారు భక్తులు. ఆయనకు మొక్కుకుంటే ఏదైనా జరుగుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. తిరుమల వీధులన్నీ భగవాన్ నామస్మరణతో మారుమోగిపోతుంటాయి. భక్తుల రద్దీతో ఎప్పుడూ దేవాలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతుంది. మరీ ఇలాంటి రద్దీ ప్రాంతంలో ఏదైనా వస్తువు పోతే తిరిగి దొరకడం సాధ్యమా..? అంటే చెప్పలేం. అయితే కలియుగ దైవం కరుణ ఉంటే ఇలాంటి సందేహాలకు తావే లేదు. అటువంటి ఓ ఘటన ఆ దేవుడి మహిమే అనిపించకమానదు. ఇంతకు ఏం జరిగిందంటే..?

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన మాధురి, తన కుటుంబ సభ్యులతో కలిసి.. ఇటీవల తిరుమల దర్శనానికి వచ్చారు. ఆమె వెంకటేశ్వర స్వామికి అపర భక్తురాలు. అక్కడ ఒక గదిని రెంట్‌కు తీసుకుని, దర్శనం పూర్తి చేసుకున్నారు. ఇష్టదైవాన్ని కన్నులారా తిలకించి.. మంగళవారం నాడు రూంను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దర్శనం బాగా జరిగిందన్న ఆనందంలో ఉంది కుటుంబం. అయితే మాధురి.. తన నల్లపూసల గొలుసు పోయిందన్న విషయాన్ని గ్రహించలేదు. తరువాత ఆ గదిని శుభ్రం చేసేందుకు వచ్చారు పారిశుద్ధ్య సిబ్బంది. రూం క్లీన్ చేస్తున్న సమయంలో వారికి ఆ నగ కనిపించింది. వెంటనే పారిశుద్ధ్య సిబ్బంది ఆ గొలుసు గురించి సమాచారాన్ని ఎస్ఎంసీ ఎంక్వైరీ ఆఫీసు అధికారులకు తెలిపారు. వెంటనే ఆ రూం వెకెట్ చేసిన వ్యక్తి వివరాలు చూసి.. మాధురికి ఫోన్ చేసి, గొలుసు గురించి చెప్పారు.

మాధురికి గొలుసు పొగొట్టుకున్న విషయం వారు ఫోన్ చేసే వరకు గుర్తించలేదు. టీటీడీ అధికారులు సమాచారం అందించాక.. చూస్తే నగ కనిపించలేదు. వెంటనే వెనక్కు వెళ్లి అధికారులను సంప్రదించారు. పోయిన నల్లపూసల బంగారపు గొలుసును మాధురికి అందించారు టీటీడీ అధికారులు. గొలుసును నమ్మకంగా అందించిన పారిశుద్ధ్య కార్మికులకు, టీటీడీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వస్తువు అందులోనూ ఖరీదైన నగ పోయిందంటే.. దొరకడం చాలా కష్టం. దీనిని బట్టి చూస్తే ఆమెకు దొరకడం నిజంగా లక్కీనే. శ్రీవారిపై ఆమెకున్న అపారమైన నమ్మకం ఆపద నుండి గట్టెక్కించింది. తను నమ్మిన దేవుడు.. ఆమెను కాపాడాడు అనుకుంటున్నారు. ఆ ఏడు కొండల వాడే వీరి రూపంలో తన నగలు అందించారని సంబర పడిపోయి ఉంటారు మాధురి. మరి మీరేమంటారో అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి