iDreamPost

Alana King: వీడియో: నో బాల్​కు సిక్స్, హిట్ వికెట్.. ఈ బ్యాటర్ ఔటా? నాటౌటా?

  • Published Feb 10, 2024 | 4:45 PMUpdated Feb 10, 2024 | 4:45 PM

క్రికెట్​లో అప్పుడప్పుడూ కొన్ని అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇది. నో బాల్​కు ఓ బ్యాటర్ సిక్స్ కొట్టి హిట్ వికెట్ అయింది. అసలు బ్యాటర్ ఔటా? నాటౌటా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్​లో అప్పుడప్పుడూ కొన్ని అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇది. నో బాల్​కు ఓ బ్యాటర్ సిక్స్ కొట్టి హిట్ వికెట్ అయింది. అసలు బ్యాటర్ ఔటా? నాటౌటా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 10, 2024 | 4:45 PMUpdated Feb 10, 2024 | 4:45 PM
Alana King: వీడియో: నో బాల్​కు సిక్స్, హిట్ వికెట్.. ఈ బ్యాటర్ ఔటా? నాటౌటా?

క్రికెట్​లో అప్పుడప్పుడూ కొన్ని అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటాయి. అస్సలు ఊహించని ఘటనలు జరిగినప్పుడు అందరూ షాకవుతుంటారు. ముఖ్యంగా ఔట్​లు, క్యాచ్​లు, రనౌట్ల విషయంలో ఇలాంటివి ఎక్కువగా చోటుచేసుకుంటాయి. పురుషుల క్రికెట్​లోనే కాదు మహిళల క్రికెట్​లోనూ అనూహ్య పరిణామాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా విమెన్స్ క్రికెట్​ మ్యాచ్​లోని ఓ ఘటన వైరల్​గా మారింది. ఒకే బాల్​కు 7 పరుగులు వచ్చిన ఈ మ్యాచ్​లో బ్యాటర్ హిట్ వికెట్ కావడం గమనార్హం. అయితే ఆ బ్యాటర్ ఔటా? కాదా? అనేది మాత్రం ఇంట్రెస్టింగ్​గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

విమెన్స్ క్రికెట్​లో భాగంగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్​లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్​ 48వ ఓవర్​లో క్లాస్ బౌలింగ్ వేస్తోంది. మూనీతో పాటు అలెన్ కింగ్ అనే బ్యాటర్ క్రీజులో ఉన్నారు. అప్పటికే 7 వికెట్లకు 254 పరుగులతో ఉన్న కంగారూ జట్టు.. మరింత భారీ స్కోరు చేయాలనే పట్టుదలతో కనిపించింది. ఆ టీమ్ బ్యాటర్లు బిగ్ షాట్స్ ఆడుతూ పరుగులు రాబట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో క్లాస్ వేసిన బాల్​ను కింగ్ సిక్స్​గా మలిచింది. లెగ్ సైడ్ వైపు పడిన ఆ ఫుల్ టాస్​ను సిక్స్​గా మలిచింది కింగ్. అయితే షాట్ కొట్టే క్రమంలో బ్యాలెన్స్ తప్పడంతో ఆమె బ్యాట్ వికెట్లను తాకింది. దీంతో ఇటు బ్యాటర్లతో పాటు అటు ఫీల్డింగ్ టీమ్ కూడా అంపైర్ ఏం నిర్ణయం తీసుకుంటారని ఆశ్చర్యపోయారు.

క్లాస్ వేసిన బాల్ ఫుల్ టాస్ కావడం, నడుము కంటే ఎత్తు నుంచి రావడంతో దాన్ని నో బాల్​గా ప్రకటించారు అంపైర్లు. నో బాల్ కింద ఒక రన్​తో పాటు సిక్స్​ను కలుపుకొని ఒక్క బాల్​కే ఆసీస్ స్కోరులో 7 పరుగులు చేరాయి. అలాగే వికెట్లను బ్యాట్​తో ఢీకొట్టిన బ్యాటర్ కింగ్ హిట్ వికెట్​గా వెనుదిరగాల్సింది. కానీ నో బాల్ కావడంతో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీంతో బౌలర్ క్లాస్ నిరాశతో తలపట్టుకుంది. అటు వికెట్ మిస్సవడం, ఇటు భారీగా రన్స్ లీక్ అవడంతో బాధలో మునిగిపోయింది. కింగ్ సిక్స్​ కొట్టి హిట్ వికెట్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన క్రికెట్ ఫ్యాన్స్ లక్ అంటే కింగ్​దేనని కామెంట్స్ చేస్తున్నారు. ఔట్ నుంచి తప్పించుకోవడంతో పాటు ఒకే బాల్​కు 7 రన్స్ రావడం సూపర్బ్ అని చెబుతున్నారు.

ఇక, ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హీలీ (60)తో పాటు బెత్ మూనీ (82), తహిలా మెక్​గ్రాత్ (44) మంచి ఇన్నింగ్స్​లు ఆడారు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ఆసీస్ 21 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో ఉంది. డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో ఈ మ్యాచ్​ను 31 ఓవర్లకు కుదించారు. సఫారీ టీమ్ విజయానికి ఇంకా 59 బంతుల్లో 122 పరుగులు చేయాల్సి ఉంది. కానీ 7 వికెట్లు పడటంతో ఆ జట్టుకు ఓటమి ఖాయమైంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప సౌతాఫ్రికా గెలవడం అసాధ్యమనే చెప్పాలి. మరి.. ఒకే బాల్​కు బ్యాటర్ 7 పరుగులు చేయడం, హిట్ వికెట్ నుంచి తప్పించుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: ఇంగ్లండ్​ సిరీస్ నుంచి కోహ్లీ ఔట్.. అభిమానుల కోరిక అలాగే ఉండిపోయింది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి