iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియా గొప్ప మనసు.. ఇండియన్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు! చరిత్రలో తొలిసారి..

  • Published May 14, 2024 | 4:23 PM Updated Updated May 14, 2024 | 4:23 PM

Border-Gavaskar Trophy 2024-25: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం ఇండియన్ ఫ్యాన్స్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. తన గొప్ప మనసును చాటుకుంటూ.. ఈ ఏర్పాట్లను చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Border-Gavaskar Trophy 2024-25: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం ఇండియన్ ఫ్యాన్స్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. తన గొప్ప మనసును చాటుకుంటూ.. ఈ ఏర్పాట్లను చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియా గొప్ప మనసు.. ఇండియన్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు! చరిత్రలో తొలిసారి..

ప్రపంచంలో ఎన్నో మెగాటోర్నీలు ఉన్నప్పటికీ.. కొన్ని టోర్నీలు మాత్రం ఫ్యాన్స్ కు ప్రత్యేకం. అందులో మెుదటిది యాషెస్ సిరీస్. ఇంగ్లండ్-ఆసీస్ మధ్య జరిగే ఈ సిరీస్ లో వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తారు. చిన్నపాటి యుద్ధంలాగా సాగే ఈ సిరీస్ కు ఎంతో క్రేజ్ ఉంది. ఇక ఆ తర్వాత మళ్లీ అంతటి క్రేజున్న సిరీస్ ఏదైనా ఉందంటే అది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే. ఆసీస్-ఇండియా మధ్య జరిగే ఈ సిరీస్ కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగిఉంది.  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం ఇండియన్ ఫ్యాన్స్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆ వివరాల్లోకి వెళితే..

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఫ్యాన్స్ మళ్లీ అంత ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ ఏదైనా ఉందంటే? అది ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచే. ఫార్మాట్ ఏదైనా ఈ సమవుజ్జీల సమరం కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తూనే ఉంటారు. దీంతో ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోర్డ్ లు సైతం ఏర్పాట్లు చేస్తుంటాయి. తాాజాగా ఇండియన్స్ ఫ్యాన్స్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా గొప్ప మనసు చాటుకుంది. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి ప్రారంభం అయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం ఆసీస్ గొప్ప నిర్ణయం తీసుకుంది.

బోర్డర్-గవాస్కర్ సిరీస్ కు అధిక సంఖ్యలో ఇండియన్ ఫ్యాన్స్ కూడా వస్తారు. ఈసారి వారికోసం ప్రత్యేకంగా ఇండియన్ ఫ్యాన్ జోన్ ఏర్పాటు చేస్తోంది. బహుశా ఇలా చేయడం చరిత్రలో తొలిసారి కావొచ్చంటున్నారు నెటిజన్లు. ఇక ఐదు టెస్టుల ఈ సిరీస్ నవంబర్ 22న ప్రారంభం అయ్యి.. 2025 జనవరి 7న ముగుస్తుంది. ఆసీస్ లో ఇండియన్స్ ఎక్కువగానే నివసిస్తున్నారు. వారందరూ ఈ మ్యాచ్ లు చూడ్డానికి వస్తారు. దాంతో వారికి ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ఏర్పాట్లను చేసింది. దాంతో పాటుగా ఇలా ప్రత్యేకంగా ఫ్యాన్స్ కు ఏర్పాటు చేయడం వల్ల ఫ్యాన్స్ మధ్య కూడా గొడవలు జరగవు. ఈ ఉద్దేశంతో కూడా ఆసీస్ ఇలా ఏర్పాట్లు చేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఇండియన్ ఫ్యాన్స్ కోసం గొప్ప మనసు చాటుకున్న క్రికెట్ ఆస్ట్రేలియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.