SNP
SRH, Kavya Maran, Australia: ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట చూసి.. చాలా మంది భయపడుతున్నారు. అయితే.. ఇదంతా కేవలం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ అదృష్టం వల్లే అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
SRH, Kavya Maran, Australia: ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట చూసి.. చాలా మంది భయపడుతున్నారు. అయితే.. ఇదంతా కేవలం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ అదృష్టం వల్లే అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 హోరాహోరీగా సాగుతోంది. సగం టోర్నీ మిగిసినా కూడా ఏ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో చెప్పడం కష్టంగా ఉంది. అంత టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. ముఖ్యంగా మన హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే.. గతంలో ఏ సీజన్‌లో ఆడని విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో సత్తా చాటుతోంది. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు భయపడే స్థాయికి వెళ్లిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎప్పుడా అంటూ ఎదురుచూస్తున్నారు. ఇంత మార్పుకు కారణం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌కు ఉన్న అదృష్టమనే చెప్పాలి. అది ఎలాగో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మొదటి నుంచి ఫాలో అవుతున్న క్రికెట్ అభిమానులకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. అదేంటంటే.. కావ్య మారన్ ఆస్ట్రేలియా క్రికెటర్లను వేలంలో కొనుగోలు చేస్తే.. వాళ్లంతా ఎస్‌ఆర్‌హెచ్ తరఫున మంచి ప్రదర్శన చేస్తారు. అయితే.. వేరే టీమ్స్ ఆస్ట్రేలియా క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించి, గతంలో లేనంత రికార్డు ధర పెట్టి టీమ్‌లోకి తీసుకున్నా వాళ్లు పెద్దగా రాణించరు. ఎస్‌ఆర్‌హెచ్‌లో డేవిడ్ వార్నర్, బెన్ కట్టింగ్, ఇప్పుడు ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీరిలో డేవిడ్ వార్నర్.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నా.. పెద్దగా రాణించడం లేదు. అతనికి కనీసం ప్లేయింగ్ ఎలెవన్‌గా చోటు కూడా లేదు.
అలాగే ఐపీఎల్ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా మిచెల్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లు పెట్టి కోల్‌కత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ, అతను దారుణంగా విఫలం అవుతున్నాడు. అలాగే ఢిల్లీలో షాన్ మార్ష్ విఫలం అవుతున్నాడు. కానీ, ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఇదంతా కావ్య మారన్‌కు ఉన్న అదృష్టం తప్పా ఇంకోటి కాదని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అయితే.. దూకుడైన క్రికెట్‌కు మారుపేరుగా నిలిచే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక్క ఎస్‌ఆర్‌హెచ్‌లో అయితేనే తమ స్థాయికి తగ్గట్లు రాణిస్తున్నారు. కానీ, మరో టీమ్‌లో అయితే పెద్దగా రాణించడం లేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pat Cummins, Mayank Agarwal & Aiden Markram’s reactions says it all on Travis Head & Abhishek Sharma’s batting.
– THE DESTRUCTIVE DUO OF SRH. 🔥 pic.twitter.com/5wyG3LpkSv
— Tanuj Singh (@ImTanujSingh) April 21, 2024