iDreamPost

అట్లీ మ్యాజిక్.. కమల్- షారూక్- విజయ్ తో భారీ ప్రాజెక్ట్?

పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులకు రొటీన్ అయిపోయాయి. అందుకేనేమో ఇప్పుడు ఇంస్ట్రీలను దాటి స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా లెవల్లో ఉన్న ముగ్గురు స్టార్ హీరోలు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా?

పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులకు రొటీన్ అయిపోయాయి. అందుకేనేమో ఇప్పుడు ఇంస్ట్రీలను దాటి స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా లెవల్లో ఉన్న ముగ్గురు స్టార్ హీరోలు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా?

అట్లీ మ్యాజిక్.. కమల్- షారూక్- విజయ్ తో భారీ ప్రాజెక్ట్?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పదం కామన్ అయిపోయింది. సూపర్ స్టార్లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది. నిజానికి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం. కానీ, ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్ కాస్టుతో సినిమాలు రావడం సాధారణ విషయంగా మారిపోయింది. అయితే ఏఏ స్టార్లు కలిసి సినిమా చేస్తున్నారు అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు చూస్తే నిజంగానే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే ఒకే స్క్రీన్ మీద లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, దళపతి విజయ్ కలిసి నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అది కూడా స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శవకత్వంలో ఈ మూవీ రాబోతోందని చెబుతున్నారు.

అట్లీ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే. శంకర్ శిష్యుడు అయిన అట్లీ తొలి చిత్రంతోనే మంచి ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నడు. రాజారాణి సినిమాకి టాలీవుడ్ లో కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంక విజయ్ తోనే మెర్సల్, బిగిల్ చిత్రాలు చేసి తన సత్తా ఏంటో ఇండస్ట్రీకి తెలియజేశాడు. ఆ తర్వాత నాలుగో చిత్రంతోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా బాలీవుడ్ బాద్ షాతో జవాన్ సినిమా తీసి సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. జవాన్ విజయం తర్వాత అట్లీతో మళ్లీ సినిమా చేసేందుకు తాను సిద్ధం అంటూ షారుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా విజయ్ కూడా అట్లీతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్- షారుక్ ఇద్దరితో కలిసి సినిమా చేసేందుకు కథ సిద్ధం చేస్తున్నాను అంటూ అట్లీ ఓ సందర్భంలో ప్రకటించారు.

ఇప్పుడు తాజాగా వస్తున్న అప్ డేట్ ఈ వార్తలకు గట్టి ఊతమిస్తోంది. అదేంటంటే.. రీసెంట్ గా డైరెక్టర్ అట్లీ- కమల్ హాసన్ ను కలిశాడు. కమల్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా రెమ్యూనరేషన్ వంటి విషయాలు కూడా మాట్లాడుకున్నారని.. త్వరలోనే అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు అంటూ గట్టిగానే బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అట్లీ దర్శకత్వంలో కమల్- షారుక్- విజయ్ కలిసి నటించబోతున్నారు అంటూ గాసిప్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కమల్ ని కలిసింది హాలీవుడ్ స్టూడియోస్ చేయబోతున్న చిత్రం కోసమా? లేక నిజంగానే ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి సినిమా చేయాలని అట్లీ చూస్తున్నాడా అనే విషయంపై క్లారిటీ అయితే రాలేదు. ఈ విషయాలు పక్కన పెడితే కమల్ హాసన్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తూనే వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇండియన్ 2 సినిమా పూర్తి చేశారు. అయితే కథ కాస్త ఎక్కువగా ఉండటంతో.. ఇండియన్ 3 కూడా రాబోతున్న విషయాన్ని ఉదయనిధి వెల్లడించారు. అందుకోసం కమల్ కొత్తగా 40 రోజుల డేట్స్ కూడా ఇచ్చారన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ కల్కి సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారు. అలాగే హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక మూవీ, మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే థగ్ లైఫ్ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇప్పుడు అట్లీతో సినిమా నిజమైతే అది కమల్ 235 మూవీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి.. అట్లీ దర్శకత్వంలో కమల్- షారుక్- విజయ్ నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి