iDreamPost
android-app
ios-app

హైపర్ ఆదితో పెళ్లి వార్తలు! క్లారిటీ ఇచ్చిన యాంకర్ వర్షిణి!

  • Author Soma Sekhar Published - 04:45 PM, Mon - 14 August 23
  • Author Soma Sekhar Published - 04:45 PM, Mon - 14 August 23
హైపర్ ఆదితో పెళ్లి వార్తలు! క్లారిటీ ఇచ్చిన యాంకర్ వర్షిణి!

ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే వార్తలు నటీ, నటుల పెళ్లికి సంబంధించినవే. పలానా నటి పలానా నటుడిని పెళ్లి చేసుకోబోతోంది అన్న న్యూస్ ఎక్కువగా పరిశ్రమలో వినిపిస్తూ ఉంటుంది. కాగా.. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యాంకర్ వర్షిణి. అవును త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

యాంకర్ వర్షిణి.. తన ముద్దు ముద్దు మాటలతో, చలాకీ తనంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఢీ డ్యాన్స్ తో పాటుగా పలు కామెడీ షోలకు యాంకరింగ్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక వీటితో పాటుగా తన హాట్ హాట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెలను మెలిపెడుతుంటుంది. కాగా.. కొన్ని రోజులుగా వర్షిణి పెళ్లికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో త్వరలోనే వర్షిణి పెళ్లి అంటూ తెగ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించింది వర్షిణి.

ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలతో పాటుగా పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఆదితో మ్యారేజ్ ఎప్పుడు అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఎమోజీలతోనే అలాంటిదేం లేదని చెప్పకనే చెప్పింది. ఇక మరో నెటిజన్ మనం పెళ్లి చేసుకుందాం అని అడిగితే.. మా అమ్మతో మాట్లాడు అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చింది. కాగా.. ఈ మధ్యకాలంలోనే వర్షిణి పెళ్లి అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. మరి వర్షిణి పెళ్లి వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఓ ఇంటి వాడు కాబోతున్న హీరో.. ఆ ప్రముఖ నటితో త్వరలో పెళ్లి!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio