iDreamPost

రివ్యూల మీద యూత్ హీరో క్లారిటీ

రివ్యూల మీద యూత్ హీరో క్లారిటీ

ఇటీవలి కాలంలో సినిమా కలెక్షన్లపై రివ్యూల ప్రభావం గురించి చాలా మంది పరిశ్రమకు చెందిన హీరోలు దర్శకులు వాపోతున్న సంగతి తెలిసిందే. గతంలో కొందరు స్టార్లు పబ్లిక్ స్టేజి మీద ఈ విషయంగానే సహనం కోల్పోయి ఏదేదో అనేసిన సందర్బాలు ఉన్నాయి. తమ సినిమా యావరేజ్ అనో ఫ్లాప్ అనో ఒప్పుకునేందుకు మనసు రాక దాన్ని మీడియా మీద తోసేసి సంఘటనలు చాలా జరిగాయి. ఇదిలా ఉండగా యూత్ హీరో నాగ శౌర్య మాత్రం దీని గురించి మంచి క్లారిటీ ఇస్తున్నాడు.

రివ్యూల వల్ల మంచి సినిమాకు చెడు జరగడం కానీ బాలేని సినిమాకు ప్లస్ అవ్వడం కానీ జరగదని తేల్చి చెప్పేశాడు. అంతే కాదు రివ్యూలు అందించే వాళ్ళు కూడా షూటింగ్ టైంలో ఇబ్బంది పెట్టరని కేవలం విడుదలయ్యాక మాత్రం తమ అభిప్రాయాలు చెప్తారని అలాంటప్పుడు వాళ్ళను నిందించి లాభం లేదని చెప్పాడు. ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో భాగమే అదని అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. నాగ శౌర్య కొత్త చిత్రం అశ్వద్ధామ ఈ నెల 31న విడుదల కానుంది. దీని ప్రమోషన్ లో భాగంగానే ఇతను విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

శౌర్య అన్నదాంట్లో నిజం ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియానో లేక సోషల్ మీడియానో ఓ సినిమాను మోసినంత మాత్రన లేక తెగిడినంత మాత్రాన వాటి ఫలితాలు తారుమారు కావు.

నిజంగా సత్తా ఉంటే హిట్ కాకుండా ఎవరూ ఆపలేరు. విషయం లేనప్పుడు ఎంత పెద్ద హీరో ఉన్నా ఫలితం ఉండదు. ఈ సత్యాన్ని గుర్తిస్తే ఎలాంటి చిక్కులు రావు. ఇదంతా బాగానే ఉంది కానీ మొదటిసారి తనే కథ రాసి స్వంత బ్యానర్ మీద కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రిస్క్ చేసిన నాగ శౌర్య అశ్వద్ధామ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఛలో తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేకపోవడంతో ఇది సక్సెస్ కావడం చాలా కీలకంగా మారింది. చూడాలి ఎలాంటి ఫలితం అందుకుంటాడో మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి