iDreamPost

రేపే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

రేపే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి, 9 రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాలలో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలు సిద్దం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్.టి.సి చార్జీలు పెంపు, ముఖ్యమంత్రి ఇంటికి పెట్టిన ఖర్చు, స్పీకర్ తమ్మినేని, కొడాలి నాని, ధర్మాన చేసిన వాఖ్యలు మీద ఫోకస్ పెట్టి సభలో ప్రస్తావించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సమాచారం, దీంతో పాటు లోకేష్ పై, చంద్రబాబు పై తీవ్ర వాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ శాశన సభ్యులు వల్లభనేని వంశీ పై అనర్హత పిటీషన్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తునట్టు సమాచారం.

అయితే అధికార పక్షం మాత్రం ఏ అంశం మీద అయిన తాము చర్చకు సిద్దం అని చెబుతుంది. తాము మ్యానిఫెస్టోలో చేప్పింది చేప్పినట్టుగా చేసుకుంటూ వస్తున్నామని, వీటిని ఎక్కడా తప్పు పట్టే అవకాశం లేదు కాబట్టి విపక్షం లేనిపోని రాద్దాంతంకి సిద్దమౌతున్నారని వీరికి అసెంబ్లీ వేదికగా గట్టి జవాబు చేబుతామని చేబుతున్నారు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాదోపవాదాలతో, విమర్శలతో ఘాటుగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి