iDreamPost

విధ్వంసానికి మారుపేరు.. 21 బంతుల్లోనే సెంచరీ! వరల్డ్ రికార్డు బద్దలు..

Asjad Butt: ప్రపంచ క్రికెట్ లో మాటలకందని విధ్వంసం నమోదైంది.. ఊహకందని ఊచకోత సృష్టించాడు ఓ బ్యాటర్. కేవలం 21 బంతుల్లోనే సెంచరీ బాది అందరిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు.

Asjad Butt: ప్రపంచ క్రికెట్ లో మాటలకందని విధ్వంసం నమోదైంది.. ఊహకందని ఊచకోత సృష్టించాడు ఓ బ్యాటర్. కేవలం 21 బంతుల్లోనే సెంచరీ బాది అందరిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు.

విధ్వంసానికి మారుపేరు.. 21 బంతుల్లోనే సెంచరీ! వరల్డ్ రికార్డు బద్దలు..

ప్రపంచ క్రికెట్ లో పెను సంచలనం నమోదైంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఓ బ్యాటర్ ఏకంగా 21 బంతుల్లోనే సెంచరీ బాది అందరిని సంభ్రమాశ్చర్యాలకి గురిచేశాడు. ఇక ఈ ఫాస్టెస్ట్ సెంచరీతో ఇదివరకే ఉన్న వరల్డ్ రికార్డు కనుమరుగైపోయింది. విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన ఈ ఇన్నింగ్స్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

యూరోపియన్ క్రికెట్ సిరీస్(ECS) టీ10 క్రికెట్ లో కనీవినీ ఎరుగని సంచలనం నమోదైంది. కలలో కూడా ఊహించని విధంగా బ్యాటింగ్ చేశాడు ఓ ప్లేయర్. ఈ లీగ్ లో భాగంగా తాజాగా కాటలున్యా డ్రాగన్స్ వర్సెస్ సోహల్ హాస్పిటలెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు సోహల్ టీమ్ ఆటగాడు అస్జద్ బట్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కాటలున్యా టీమ్ నిర్ణీత 10 ఓవర్లలకు 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సోహల్ జట్టు కేవలం 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అదేంటి? 156 రన్స్ ను 5.3 ఓవర్లలోనే దంచికొట్టారా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజం.

సోహల్ జట్టు ప్లేయర్ అస్జద్ బట్ థండర్ ఇన్నింగ్స్ ముందు కొండంత లక్ష్యం కూడా చిన్నబోయింది. బౌలర్లపై ఓ మినీ యుద్ధాన్నే ప్రకటించాడు అస్జద్. సిక్సుల వర్షం కురిపించి, కేవలం 21 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే లీగ్ లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ రికార్డు గతంలో మార్ట్సా సీసీ ఓపెనర్ షేర్ అలీ పేరిట ఉంది. అతడు 2023లో 25 బంతుల్లో శతకం బాదగా.. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు అస్జద్.

ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా అస్జద్ 27 బంతులు ఎదుర్కొని 18 సిక్సర్లు, 4 ఫోర్లతో 128 పరుగులు చేశాడు. దీంతో లక్ష్యం కాస్త ఊదేశాడు. బౌలర్ ఎవరన్నది కాదన్నయ్య.. బాల్ బౌండరీ వెళ్లిందా?లేదా? అన్న చందంగా అతడి బ్యాటింగ్ కొనసాగింది. ఇతడి హిట్టింగ్ దాటికి మైదానంలో ఫీల్డర్లు రెస్ట్ తీసుకున్నారనడంలో అతిశయోక్తిలేదు. ఇక అస్జద్ సెంచరీ బాదిన వీడియోను యూరోపియన్ క్రికెట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ఊచకోతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: లోక్ సభ ఎన్నికల బరిలో యువరాజ్ సింగ్? ఆ పార్టీ నుంచి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి