iDreamPost

లోక్ సభ ఎన్నికల బరిలో యువరాజ్ సింగ్? ఆ పార్టీ నుంచి..

Yuvraj Singh: త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సిక్సర్ల కింగ్ ఏ పార్టీ తరపున, ఏ స్థానంలో బరిలో నిలుస్తాడో తెలుసుకుందాం పదండి.

Yuvraj Singh: త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సిక్సర్ల కింగ్ ఏ పార్టీ తరపున, ఏ స్థానంలో బరిలో నిలుస్తాడో తెలుసుకుందాం పదండి.

లోక్ సభ ఎన్నికల బరిలో యువరాజ్ సింగ్? ఆ పార్టీ నుంచి..

భారతదేశంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మ్రోగనుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఏ అభ్యర్థిని ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ముందుకుసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటు టీమిండియా క్రికెట్ వర్గాల్లో.. అటు రాజకీయ వర్గాల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్, 2011 వరల్డ్ కప్ విన్నింగ్ హీరో యువరాజ్ సింగ్ రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోతున్నాడట. మరి సిక్సర్ల కింగ్ ఏ స్థానం నుంచి పోటీ చేయనున్నాడు? ఏ పార్టీ తరఫున బరిలోకి దిగనున్నాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..

యువరాజ్ సింగ్.. భారత క్రికెటే కాదు, ప్రపంచ క్రికెట్ ఉన్నంత కాలం ఈ పేరు అభిమానులకు గుర్తుండిపోతుంది. టీమిండియా చిరకాల స్వప్నం అయిన వరల్డ్ కప్ ను 2011లో అందించిన హీరో యువరాజ్. క్యాన్సర్ తో పోరాడుతూనే.. తన అసామాన ప్రతిభతో జట్టు ప్రపంచ కప్ ను అందించాడు. ఇక తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పలు లీగ్స్ లో ఆడుతూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో అవతారంలో యువీ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అవును త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో యువీ బరిలోకి దిగబోతున్నాడని సమాచారం. పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సిక్సర్ల కింగ్ నిలబడనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఈ న్యూస్ వైరల్ కావడానికి కారణం లేకపోలేదు. యువీ తన తల్లి షబ్నమ్ తో కలిసి తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశాడు. దీంతో ఈ ప్రచారం కాస్త ఊపందుకుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు యువరాజ్ కూడా నోరు విప్పకపోవడంతో.. ఇది నిజమే అని ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు కూడా భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం గురుదాస్ పూర్ ఎంపీగా ప్రముఖ సినీ నటుడు సన్నీ డియోల్ ఉన్నాడు. ఇతడు 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఇదిలా ఉండగా.. ఈ వార్తలను కొందరు కొట్టిపారేస్తున్నారు. యువీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఇలాంటి వార్తలను నమ్మకండని కామెంట్స్ చేస్తున్నారు. భారత్-పాక్ బోర్డర్ కు ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గం నుంచి యువీ బరిలోకి దిగుతాడా? లేదా? చూడాలి మరి.

ఇదికూడా చదవండి: విరాట్ కోహ్లీ కొడుక్కి బ్రిటన్ పౌరసత్వం.. సరికొత్త చర్చ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి