iDreamPost

ఆరోగ్య సమస్యలున్న వారికి 5 లక్షల వరకు లోన్.. త్వరలోనే కొత్త యాప్!

New APP For Health Care Loans: ఎక్కడైనా పర్సనల్ లోన్, వస్తువులు కొనుక్కోవడానికి లోన్ ఇచ్చే వారిని, యాప్స్ ని చూసుంటారు. కానీ మొదటిసారి ఆరోగ్య సమస్యల కోసం లోన్ ఇచ్చే యాప్ రాబోతోంది.

New APP For Health Care Loans: ఎక్కడైనా పర్సనల్ లోన్, వస్తువులు కొనుక్కోవడానికి లోన్ ఇచ్చే వారిని, యాప్స్ ని చూసుంటారు. కానీ మొదటిసారి ఆరోగ్య సమస్యల కోసం లోన్ ఇచ్చే యాప్ రాబోతోంది.

ఆరోగ్య సమస్యలున్న వారికి 5 లక్షల వరకు లోన్.. త్వరలోనే కొత్త యాప్!

సాధారణంగా గతంలో అంటే ఏదైనా అవసరం వస్తే తెలిసిన వాళ్లనో.. అయిన వాళ్లనో అప్పు అడిగేవాళ్లు. కాస్త సాయం చేయమని వేడుకునే వాళ్లు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. ఏది కావాలన్నా డిజిటల్ యుగంలో ఒకరిపై ఆధార పడాల్సిన అవసరం లేదు. మీకు ఏ చిన్న అవసరం ఉన్నా దానికి అప్పు ఇచ్చేందుకు నెట్టింట చాలానే యాప్స్, వెబ్ సైట్స్ ఉన్నాయి. వారు ఇచ్చే దానికి వడ్డీ వసూలు చేసినా కూడా అప్పటికి మిమ్మల్ని మాత్రం గండం నుంచి గట్టెక్కిస్తారు. అయితే ఇలాంటి యాప్స్ కూడా కారు కొనడానికో, హాలిడే ట్రిప్ కి వెళ్లడానికో లోన్స్ ఇస్తారు. కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాస్త డబ్బులిస్తారా అంటే ఇవ్వకపోవచ్చు. కానీ, ఇప్పుడు కేవలం ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి లోన్స్ ఇచ్చేందుకే కొత్త యాప్ రాబోతోంది.

అవును మీరు ఇప్పటి వరకు ఆన్ లైన్ లో ఉన్న యాప్స్, లోన్ యాప్స్ అన్నీ కూడా ఇంట్లో అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, వస్తువులు కొనుగోలు చేయడానికి మాత్రమే లోన్స్ ఇచ్చేవాళ్లు.కానీ, ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటే ఆస్పత్రిలో చూయించుకోవడానికి అప్పులు ఇస్తామంటూ కొత్త యాప్ రాబోతోంది. అది కూడా దానిని ప్రారంభింస్తోంది మరెవరో కాదు.. భారత్ పే ఫౌండర్లలో ఒకరైన అష్నీర్ గ్రోవర్. భారత్ పేకి వీడ్కోలు చెప్పిన తర్వాత తన భార్యతో కలిసి అష్నీర్ గ్రోవర్ థర్డ్ యూనికాన్ ని స్థాపించారు. 2023లో క్రిక్ బే అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ ని అట్టహాసంగా లాంఛ్ చేశారు. అయితే ఇప్పుడు గ్రోవర్ దృష్టి మెడికల్ ఫీల్డ్ మీద పడింది అంటున్నారు.

అష్నీర్ గ్రోవర్ త్వరలోనే జీరో పే పేరిట ఒక కొత్త యాప్ ని తీసుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆ యాప్ టెస్టింగ్ లెవల్లో ఉంది అంటున్నారు. ఈ యాప్ ద్వారా మెడికల్ బిల్స్, ట్రీట్మెంట్ అవసరాల కోసం ఏకంగా రూ.5 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తారని చెప్తున్నారు. ఈ జీరో పే యాప్ ఢిల్లీకి చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్ అయిన ఫిక్ వెస్ట్ తో కలిసి పని చేస్తుందని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా వచ్చే రూ.5 లక్షల వరకు లోన్ మొత్తాన్ని మీకు నచ్చిన ఆస్పత్రిలో వాడుకునేందుకు వీల్లేదు. ఈ జీరో పే యాప్ వారితో అనుబంధంగా ఉన్న నెట్ వర్క్ ఆస్పత్రుల్లోనే ఈ లోన్ ని వాడుకునే సౌకర్యం ఉంటుంది.

Zerope app loan for health issues

ప్రస్తుతం ఇండియాలో అందరికీ హెల్త్ కేర్ మీద శ్రద్ధ పెరిగింది. అందరూ ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం భారతీయులు అలాంటి సేవలు అందించే యాప్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందుకే అష్నీర్ గ్రోవర్ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. 2023 నాటికి భారతదేశంలో హెల్త్ కేర్ మార్కెట్ విలువ 37 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఒక అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అష్నీర్ కూడా జీరోపే యాప్ తీసుకురావడంతో దానికి గుర్తింపు లభిస్తోంది. మరి.. ఆరోగ్య సమస్యలకు రూ.5 లక్షల వరకు లోన్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి