iDreamPost
android-app
ios-app

పాకెట్‌మనీ కోసం వ్యాపారం.. 28 ఏళ్ళకే కోట్ల ఆదాయం

పాకెట్ మనీ సరిపోవడం లేదని వ్యాపారం చేయాలని భావించిన ఓ యువకుడు దేశంలోనే తొలి స్టూడెంట్ ఫుడ్ ట్రక్ ని ఏర్పాటు చేశాడు. బుల్లెట్ బండి బార్బెక్యూ ట్రక్ ని ఏర్పాటు చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాడు.

పాకెట్ మనీ సరిపోవడం లేదని వ్యాపారం చేయాలని భావించిన ఓ యువకుడు దేశంలోనే తొలి స్టూడెంట్ ఫుడ్ ట్రక్ ని ఏర్పాటు చేశాడు. బుల్లెట్ బండి బార్బెక్యూ ట్రక్ ని ఏర్పాటు చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాడు.

పాకెట్‌మనీ కోసం వ్యాపారం.. 28 ఏళ్ళకే కోట్ల ఆదాయం

జీవితంలో ఎదగాలన్నా కసి ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేధించొచ్చు. ప్రస్తుత కాలంలో యువత ఆలోచనా విధానం మారుతోంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసేకంటే సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. స్టార్టప్ లను ప్రారంభించి ఆకాశమే హద్దుగా ఎదిగిపోతున్నారు. చిన్న వయసులోనే కోట్లు సంపాదిస్తూ కోటీశ్వరులుగా మారుతున్నారు. ఇదే విధంగా ఓ విద్యార్థి తాను డిగ్రీ చదివే రోజుల్లో పాకెట్ మనీ సరిపోవడం లేదని ఓ వ్యాపారాన్ని ప్రారంభించాడు. 28 ఏళ్లకే కోట్ల వ్యాపారంగా మార్చి ఔరా అనిపిస్తున్నాడు. ఆ విద్యార్థి మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన అరుణ్.

అరుణ్ దేశంలోనే తొలి స్టూడెంట్ ఫుడ్ ట్రక్ ని ఏర్పాటు చేశాడు. బుల్లెట్ బండి బార్బెక్యూ ట్రక్ ని ఏర్పాటు చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ వ్యాపార సామ్రాజ్యం దేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నాడు. లండన్ లో కూడా స్ట్రీట్ ఫుడ్ చెయిన్ ను నిర్వహిస్తున్నాడు. కాగా అరుణ్ తండ్రి ఓ సైనికాధికారి. ఆయన బదిలీల్లో భాగంగా అరుణ్ కుటుంబం కర్ణాటకలోని కరవా అన్న ప్రాంతానికి వచ్చింది. డిగ్రీ చదువు కోసం అరుణ్ ను బెంగళూరులోని ఓ కాలేజీలో చేర్పించారు. అయితే ఆ సమయంలో తల్లిదండ్రులు పంపించే డబ్బు సరిపోక పోయేదని అరుణ్ తెలిపాడు. పాకెట్ మనీ కోసం ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు.

అప్పటికే అతడికి విదేశీ ఫుడ్ ట్రక్కులపై అవగాహన ఉంది. అలాంటి వాటిని బెంగళూరులో కూడా ఏర్పాటు చేస్తే వ్యాపారం బాగుంటుందని చెప్పి ఫ్రెండ్స్ తో వ్యాపారం మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇందుకోసం అవసరమైన 4 లక్షల డబ్బును అతి కష్టం మీద సేకరించి 2015లో టెంపో ట్రావెలర్ వ్యాన్ ను కొని ఫుడ్ ట్రక్ గా మార్చాడు. తొలి రోజు కస్టమర్ల నుంచి వచ్చిన స్పందనతో రూ. 3 వేలు వస్తది అనుకుంటే ఏకంగా 10 వేల వ్యాపారం జరిగిందని తెలిపాడు. ఆ తర్వాత అది రోజుకు 25 వేలకు చేరిందని వెల్లడించాడు. ఇక ఆ తర్వాత బెంగళూరులో స్ట్రీట్ ఫుడ్ ట్రక్కులు ఎక్కువ అయిపోవడంతో మరో ఆలోచన చేసినట్లు తెలిపాడు. షోలే సినిమాలో అమితాబ్‌, ధర్మేంద్రలు కుర్చున్న సైడ్ కార్ బైక్‌ ను చూసి సైడ్ కార్ స్థానంలో చిన్న మాడ్యూలర్ కిచెన్ ఉంటే బార్బీక్యూ అందించొచ్చని ఆలోచించాడు.

వెంటనే రెండు బుల్లెట్ బైకులను కొని మెకానిక్ సాయంతో బుల్లెట్ బండి బార్బీక్యూ ట్రక్ ను సిద్ధం చేశాడు. అరుణ్ కు అమ్మ, తమ్ముడు ఆసరగా చేరారు. టేస్టీ బార్బీక్యూ చేయడంలో అమ్మ చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయని అరుణ్ తెలిపాడు. బీబీక్యూ ఇండియా రైడ్‌ పేరుతో బెంగళూరులో రెండు చోట్ల మా బైకుల్ని పెట్టామని.. తొలిరోజే రెండింటికీ కలిపి రూ.50 వేల అమ్మకాలు జరిగాయాని వెల్లడించాడు. ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదని తెలిపారు.

తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖతోపాటూ కాకినాడ, కొవ్వూరుల్లో బుల్లెట్ బండి బార్బెక్యూ ట్రక్ పెట్టి విజయం సాధించామని తెలిపాడు. 114 బైకులతో దేశంలో తొలి ‘స్ట్రీట్‌ చెయిన్‌’గా గుర్తింపు సాధించాం. ఖతార్‌, లండన్‌లకి కూడా ఫ్రాంచైజీలు ఇవ్వగలిగాం. వీటన్నింటిపైన వస్తున్న రాయల్టీలతో ఏటా కోట్లరూపాయల మేర టర్నోవర్‌ సాధిస్తున్నామని అరుణ్ చెప్పుకొచ్చాడు. 28 ఏళ్ల వయసుకే కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న అరుణ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి