iDreamPost
android-app
ios-app

ఆర్మా కొత్త ఫోల్డబుల్ ఈ-స్కూటర్.. బ్యాగులో పెట్టుకుని తీసుకుపోవచ్చు!.. ధర ఎంతంటే?

మడతపెట్టే ఎలక్ట్రిక్ స్కూటర్ ను జపాన్ కు చెందిన ఆర్మా కంపెనీ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ను బ్యాగులో పెట్టుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. మరి దీని ధర ఎంతంటే?

మడతపెట్టే ఎలక్ట్రిక్ స్కూటర్ ను జపాన్ కు చెందిన ఆర్మా కంపెనీ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ను బ్యాగులో పెట్టుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. మరి దీని ధర ఎంతంటే?

ఆర్మా కొత్త ఫోల్డబుల్ ఈ-స్కూటర్.. బ్యాగులో పెట్టుకుని తీసుకుపోవచ్చు!.. ధర ఎంతంటే?

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు సరికొత్త మోడళ్లతో ఈ-స్కూటర్లను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగిన విధంగా ఈ స్కూటర్లు, బైకులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మీరు బ్యాగులో పెట్టుకుని ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. సొంత వెహికిల్స్ ఉన్న సమయాల్లో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తే మన టూ వీలర్ ను తీసుకెళ్లడం సాధ్యపడదు. అటువంటి సమయాల్లో ఈ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇటీవల ఆర్మా కంపెనీ నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. ఈ స్కూటర్ ను మడతపెట్టి ఎంచక్కా బ్యాగులో లేదా సూట్ కేసులో పెట్టుకుని పట్టుకెళ్లొచ్చు.

అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అద్బుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇప్పటి వరకు మడతపెట్టే ఫోన్లు రాగా.. ఇప్పుడు ఫోల్డబుల్ స్కూటర్లు కూడా వచ్చేస్తున్నాయి. లేటెస్టు ఫీచర్లతో, బడ్జెట్ ధరల్లోనే ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కడికైన వెళ్లినప్పుడు సొంత టూ వీలర్ ఉండాలనుకునే వారికి జపాన్‌కు చెందిన ‘ఆర్మా’ కంపెనీ ఫోల్టబుల్ ఈ స్కూటర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై వెళ్లాల్సిన గమ్యానికి చేరుకున్న తర్వాత దర్జాగా మడతపెట్టి బ్యాగులో పెట్టుకోవచ్చు.

అంతే కాదండోయ్ ట్రాఫిక్ ఉన్న సమయాల్లో కూడా కాస్తంతా చోటు ఉన్నా చాలు వాహనాల మధ్యలో రయ్ రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు. ట్రాఫిక్ సమస్యలనుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇక దీని బరువు 4.5 కిలోలు మాత్రమే ఉంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 30 కిలోమీటర్లు. దీని ధర 1.35 లక్షల యువాన్లు (రూ.76,203) మాత్రమే అని కంపెనీ ప్రకటించింది. మరి ఆర్మా కంపెనీ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి