iDreamPost

కాల్వలో పడిన కారు.. ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్!

AR Constable: ఇటీవల కాలంలో వివిధ రకాల ప్రమాదాలకు గురైన వారికి పోలీసులు దేవుళ్ల వచ్చి కాపాడుతున్నారు. తాజాగా ఓ ఏఆర్ కానిస్టేబుల్ కాల్వలో పడిన ఏడుగురి ప్రాణాలను కాపాడి దేవుడయ్యారు.

AR Constable: ఇటీవల కాలంలో వివిధ రకాల ప్రమాదాలకు గురైన వారికి పోలీసులు దేవుళ్ల వచ్చి కాపాడుతున్నారు. తాజాగా ఓ ఏఆర్ కానిస్టేబుల్ కాల్వలో పడిన ఏడుగురి ప్రాణాలను కాపాడి దేవుడయ్యారు.

కాల్వలో పడిన కారు.. ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్!

ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తోందో ఎవ్వరం చెప్పలేము. ఇలా జరిగే అకస్మాత్తు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే కొందరిని ఆ దేవుడే మనిషి రూపంలో వచ్చి కాపాడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఏదైన ప్రమాదం జరిగినప్పుడు కాపాడాలి అనే ఆలోచన రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అలానే తమ ప్రాణాలకు ప్రమాదం ఉంటుందంటే అసలు ఎవ్వరు కాపాడే సాహసం చేయరు. చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి సాహసలు చేస్తుంటారు. తాజాగా కాల్వలో పడిన కారులోని ఏడుగురిని ఓ ఏఆర్ కానిస్టేబులు కాపాడారు. దీంతో సెల్యూట్ అంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తోన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామంలో కసుకుర్తి భాస్కర్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటుంది. ఆయన కుటుంబం ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైంది. అక్కడ బంధువులతో ఎంతో సంతోషంగా చాలా సమయం పాటు గడిపారు. ఇక భాస్కర్ కుటుంబం తిరిగి స్వగ్రామానికి బయటలు దేరింది. ఈ క్రమంలోనే వారి కారు పి.గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద రాగానే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న  బైక్ ను ఢీకొట్టింది. అనంతరం అంతే వేగంతో సమీపంలోని పంట కాల్వలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నెల్లి శ్రీనివాస్..కాల్వలో పడి ఉన్న కారును చూశారు.

ఆయన వెంటనే స్పందించి పంటకాల్వలోకి దూకారు. వారని కాపాడేందుకు కారు డోర్లు తెరిచే ప్రయత్నం చేశారు. కానీ చాలా సమయం పాటు ఆ డోర్లు రాలేదు. చివరకు ఏదోలా చేసి..కార్ల డోర్లు ఓపెన్ చేసి లోపల ఉన్న కసుకుర్తి భాస్కర సుధీర్‌కుమార్‌,  ఆయన భార్య సింధు, పిల్లలు భాను, జయాన్షు, తల్లి పార్వతి, అత్త బిక్కిన సూర్యకాంతం, మామ సుబ్బారాయుడును బయటకు తీసుకొచ్చి… ఒడ్డున ఉన్న వలంటీర్‌ లక్ష్మణ్‌, స్థానికుల సాయంతో రక్షించారు. నెల్లి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఏఆర్ కానిస్టేబుల్‌ శ్రీనివాస్ ను స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే చిట్టిబాబు, స్థానికులు అభినందించారు.

అలానే ప్రమాదానికి గురైన కుటుంబం శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు అంటే చాలా మందికి అదే రకమైన అభిప్రాయం ఉంటుంది. కానీ వాళ్లకు మనస్సు ఉంటుంది. ముఖ్యంగా ఎదుటి వారి ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం అర్పించే తెగువ ఉంటుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడి అమరులైన పోలీసులు ఎందరో ఉన్నారు. అలానే ఇటీవల కాలంలో గుండె పోటుకు గురైన వారిని పోలీసులు సీపీఆర్ చేసిన ప్రాణాలు కాపాడిన ఘటనలు చాలానే జరిగాయి. మరి.. ఏడు మంది ప్రాణాలను  కాపాడిన ఈ పోలీస్ కానిస్టేబుల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి