iDreamPost

Group-2: నిరుద్యోగులకు AP సర్కార్ శుభవార్త! గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల..

ప్రభుత్వం కొట్టడం చాలా మంది జీవిత లక్ష్యం. దాని కోసం రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇలా యువత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రభుత్వం కొట్టడం చాలా మంది జీవిత లక్ష్యం. దాని కోసం రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇలా యువత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది.

Group-2: నిరుద్యోగులకు AP సర్కార్ శుభవార్త! గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల..

నిరుద్యోగులు  ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత ఉత్కంఠకు తెర దించుతూ  గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వలోని వివిధ శాఖల్లో  ఖాళీగా ఉన్న గ్రూప్ -2 పోస్టుల భర్తీకీ ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ కమిషన్ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీపీఎస్సీ త్వరలో  100 గ్రూప్-1 పోస్టులతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్ తో మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. గతేడాది ఎలాంటి వివాదలకు తావులేకుండా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలల కాలంలోనే పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. పలు న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొనేందుకు గత నాలుగేళ్లలో  అనేక సంస్కరణలను ఏపీపీఎస్సీ తెచ్చింది. ఈ నేపథ్యంలనో తాజాగా గ్రూప్-2 పోస్టుల భర్తీని సైతం పారదర్శకంగా కేవలం 6 నెలల వ్యవధిలోనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది.  తాజాగా 897 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇక ఈ 897 పోస్టులో  331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు ఉన్నాయి. గతంలో కంటే ఈ సారి ఎక్కువ సంఖ్యలో గ్రూప్-2 పోస్టులను విడుదల చేశారని యువత సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక దరఖాస్తు  డిసెంబర్ 21వ తేదీ ప్రారంభమై జనవరి 10 తేదిన ముగుస్తుంది. ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 25న ఆఫ్ లైన్ లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.  కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్ సైట్ లో తమ ప్రొఫైల్ ను రిజిస్ట్రేషన్ చేసుకుని..వచ్చిన ఓటీపీఆర్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల సంఖ్య: 897

డిప్యూటీ తహసీల్దార్ -115

ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ -150

గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ -4

గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ -16

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ -28

59 శాఖల్లోని ఎగ్జిక్యూటీవ్ పోస్టులు -331

నాన్ ఎగ్టిక్యూటీవ్ విభాగంలో -556

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

చివరి తేది:

డిసెంబర్ 20 నుంచి జనవరి 10

పరీక్ష విధానం:

ప్రిలిమ్స్- 150 మార్కులు

ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టీవ్ తరహాలో ఆఫ్ లైన్ లో నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్ , మెంటల్ ఎబిలిటీ విభాగాల్లో 150 మార్కులకు ఉంటుంది. పరీక్షకు 2.30 గంటల సమయం ఉంటుంది.

మెయిన్స్ -300 మార్కులు

ఇక మెయిన్స్ లో పేపర్ -1 పేపర్ -2 అనే రెండు ఉంటాయి.  రెండు 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్చించాల్సి ఉంటుంది.

ఈ మొత్తం ప్రక్రియను మే నెల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో కమిషన్  ప్రణాళిక సిద్ధం చేసింది. ఖాళీలు, వేతనం, వయస్సు, విద్యార్థతలతో పాటు పూర్తి సమాచారం కోసంకమిషన్ వెబ్ సైట్ https://psc.ap.gov.in  లో చూడవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి