iDreamPost

మీరు ఇంటర్ పాస్ అయ్యారా.. పరీక్ష లేకుండానే Indian Navyలో ఆఫీసర్ కావొచ్చు!

పరీక్ష లేకుండానే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందొచ్చు. తాజాగా ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నాలుగు సంవత్సరాల బీటెక్ డిగ్రీ కోర్సు కోసం ఖాళీలను ప్రకటించింది.

పరీక్ష లేకుండానే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందొచ్చు. తాజాగా ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నాలుగు సంవత్సరాల బీటెక్ డిగ్రీ కోర్సు కోసం ఖాళీలను ప్రకటించింది.

మీరు ఇంటర్ పాస్ అయ్యారా.. పరీక్ష లేకుండానే Indian Navyలో ఆఫీసర్ కావొచ్చు!

దేశ సేవ చేసేందుకు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీలో చేరాలని యువత కలలుకంటుంటారు. ఉగ్రవాదులు చేసే దాడుల నుంచి, ఇతర దేశాల దాడుల నుంచి దేశ సంపదను, ప్రజల ప్రాణాలను రక్షించి సేవ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సమాజంలో సైనికులకు ఎంతో గౌరవ మర్యాదలు ఉంటాయి. కాగా త్రివిద దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో చేరే అవకాశం వచ్చింది. మీరు ఇంటర్ పాసైతే చాలు నేవీలో ఆఫీసర్ గా సెటిల్ కావొచ్చు. పరీక్ష లేకుండానే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందొచ్చు. తాజాగా ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నాలుగు సంవత్సరాల బీటెక్ డిగ్రీ కోర్సు కోసం ఖాళీలను ప్రకటించింది.

ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ మరియు టెక్నికల్ బ్రాంచ్ లో 35 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు కోర్సు పూర్తైన తర్వాత, ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌లలోని అధికారుల పోస్టులలో నియమించబడతారు. ఈ కోర్సు ద్వారా ఎంపికైన అభ్యర్థులు అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో నాలుగు సంవత్సరాల బీటెక్ కోర్సులో క్యాడెట్‌లుగా చేర్చబడతారు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం బీటెక్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ను పరిశీలించ వచ్చును.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల సంఖ్య

  • ఎగ్జిక్యూటివ్ & టెక్నికల్ బ్రాంచ్:
  • 35 ఖాళీలు

వయోపరిమితి:

  • 02 జనవరి 2005 మరియు 01 జూలై 2007 మధ్య జన్మించి ఉండాలి.

అర్హత

  • అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్ లో కనీసం 70% మార్కులతో ,ఇంగ్లీష్ లొ కనీసం 50% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, జేఈఈ మెయిన్-2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2023 యొక్క ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ జాబితా ద్వారా సర్వీస్ సెలక్షన్ బోర్డ్ కోసం పిలుస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి