iDreamPost
android-app
ios-app

రిలీజైన iOS 18 డెవలపర్ బీటా 2 వెర్షన్.. మైండ్ బ్లాక్ చేస్తున్న కొత్త ఫీచర్స్!

  • Published Jun 25, 2024 | 5:13 PM Updated Updated Jun 25, 2024 | 5:13 PM

iOS 18 New Features: అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో యాపిల్ కంపెనీ ఐఓఎస్ 18 ఆపరేటింగ్ సిస్టంని తీసుకొస్తుంది. ఇప్పటికే డెవలపర్ బీటా వెర్షన్ 1లో పలు ఫీచర్స్ ని యాడ్ చేసిన యాపిల్ కంపెనీ.. తాజాగా బీటా 2 వెర్షన్ లో మరిన్ని ఫీచర్స్ ని యాడ్ చేసింది.

iOS 18 New Features: అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో యాపిల్ కంపెనీ ఐఓఎస్ 18 ఆపరేటింగ్ సిస్టంని తీసుకొస్తుంది. ఇప్పటికే డెవలపర్ బీటా వెర్షన్ 1లో పలు ఫీచర్స్ ని యాడ్ చేసిన యాపిల్ కంపెనీ.. తాజాగా బీటా 2 వెర్షన్ లో మరిన్ని ఫీచర్స్ ని యాడ్ చేసింది.

రిలీజైన iOS 18 డెవలపర్ బీటా 2 వెర్షన్.. మైండ్ బ్లాక్ చేస్తున్న కొత్త ఫీచర్స్!

నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 18ను యాపిల్ కంపెనీ జూన్ 10వ తారీఖున తొలిసారి వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ లో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డెవలపర్లకి పలు ఫీచర్లతో కూడిన బీటా 1 వెర్షన్ ని విడుదల చేసింది. తాజాగా ఐఓఎస్ 18 డెవలపర్ బీటా 2 వెర్షన్ ను యాపిల్ కంపెనీ విడుదల చేసింది. బీటా 1 వెర్షన్ లో యాప్ లు, విడ్జెట్ లు, ఫోల్డర్లు హోమ్ స్క్రీన్ లో కనిపించకుండా ఉంచే ఫీచర్.. అలానే ఫస్ట్ పార్టీ యాప్ ఐకాన్స్ లో డార్క్ మోడ్ వంటి కొత్త ఫీచర్స్ ని పరిచయం చేసింది. తాజాగా బీటా 2 వెర్షన్ లో మరిన్ని ఫీచర్స్ ని రిలీజ్ చేసింది. ఐఫోన్ మిర్రరింగ్, యాప్ స్టోర్ లో డార్క్ మోడ్ ఫీచర్ సహా పలు ఫీచర్స్ ని రిలీజ్ చేసింది. మరి ఆ ఫీచర్స్ ఏంటో ఓ లుక్కేయండి. 

ఐఓఎస్18 డెవలపర్ బీటా 2 వెర్షన్ ఫీచర్స్:

యాప్ స్టోర్:

యాప్ స్టోర్ ఇక నుంచి డార్క్ మోడ్ ఐకాన్ తో కనిపిస్తుంది. 

మల్టీ లాంగ్వేజ్ కీబోర్డు:

ఐఓఎస్ లో మల్టీ లాంగ్వేజ్ కీబోర్డు ఉంది. ఇప్పుడు మరిన్ని భాషలకు విస్తరించారు. ఒకేసారి మూడు భాషలను సపోర్ట్ చేసేలా ఈ మల్టీ లాంగ్వేజ్ కీబోర్డుని రూపొందించారు. ఈ భాషల్లో ఇంగ్లీష్, హిందీ సహా 27 భారతీయ భాషలు ఉన్నాయి. 

ఐఫోన్ మిర్రరింగ్:

ఐఫోన్ మిర్రరింగ్ అనేది స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్. దీంతో ఐఫోన్ స్క్రీన్ ను మ్యాక్ కంప్యూటర్, మ్యాక్ ల్యాప్ టాప్స్ వంటి వాటిలో మిర్రరింగ్ చేయవచ్చు. ఈ ఫీచర్ తో ఐఫోన్, ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ఇలా రెండు డివైజ్ ల మధ్య కనెక్టివిటీ అనేది ఉంటుంది. రెండు డివైజెస్ లోనూ కాల్స్, నోటిఫికేషన్స్ వంటివి పొందొచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఐఫోన్ లేదా మ్యాక్ కంప్యూటర్ లో ఉన్న ఫోల్డర్లు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మ్యాక్ ఓఎస్ సెఖోయాతో బీటా 2 వెర్షన్ తో నడిచే మ్యాక్ లన్నింటిలో ఈ ఫీచర్ ఉంటుంది.

ఆర్సీఎస్ మెసేజింగ్: 

రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ మెసేజింగ్ సపోర్ట్ ని బీటా 2 వెర్షన్లో చేర్చారు. అయితే దీన్ని ఇంకా యాక్టివేట్ చేయలేదని తెలుస్తోంది. ఈ ఫీచర్ తో నేరుగా మెసేజుల నుంచి ఎంఎంఎస్ మెసేజులని కూడా పంపించుకోవచ్చు.

ప్రస్తుతానికైతే ఇవే డెవలపర్స్ బీటా 2 వెర్షన్ లో తీసుకొచ్చిన ఫీచర్స్. ఇవి టెస్టింగ్ దశలో ఉన్నాయి. ఏమైనా లోపాలు ఉంటే సరి చేసి యూజర్ల కోసం రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం అయితే డెవలపర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఓఎస్ 18 రిలీజ్ కానుంది.