iDreamPost
android-app
ios-app

WhatsApp యూజర్ల కోసం అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్! ఇక నుంచి తెలియని వారి మెసేజీలు రావు..

  • Published Sep 22, 2024 | 11:43 AM Updated Updated Sep 22, 2024 | 11:43 AM

WhatsApp: వాట్సాప్ ఎప్పటికప్పుడు మంచి ఫీచర్లని తీసుకొస్తుంది. తాజాగా మరో ఫీచర్ని తీసుకొచ్చింది.

WhatsApp: వాట్సాప్ ఎప్పటికప్పుడు మంచి ఫీచర్లని తీసుకొస్తుంది. తాజాగా మరో ఫీచర్ని తీసుకొచ్చింది.

WhatsApp యూజర్ల కోసం అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్! ఇక నుంచి తెలియని వారి మెసేజీలు రావు..

వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు మంచి ఫీచర్లని తీసుకొస్తుంది. తాజాగా మరో సూపర్ ఫీచర్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సూపర్ సెక్యూరిటీ ఫీచర్ని ప్రవేశపెట్టింది. యూజర్ల సేఫ్టీ ఇంకా సెక్యూరిటీ కోసం ఈ కొత్త ఫీచర్ ను యాడ్ చేస్తుంది. తన వినియోగదారుల సెక్యూరిటీ కోసం ఇప్పటికే చాలా ఫీచర్స్ ను అందించిన వాట్సాప్, తాజాగా మరో ఉపయోగపడే సెక్యూరిటీ ఫీచర్ ను తీసుకు వస్తోంది. వాట్సాప్ అప్డేట్ లను అందించే వాబీటా ఇన్ఫో ఈ కొత్త ఫీచర్ గురించి తెలిపింది. ఇక వాట్సాప్ అందిస్తున్న ఈ అప్ కమింగ్ ఫీచర్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనకు తెలియని వారి నుంచి వచ్చే మెసేజ్ లను అడ్డుకోవడానికి వారి అకౌంట్ లను బ్లాక్ చేసే విధంగా ఈ ఫీచర్ ను వాట్సాప్ తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ‘బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్నోన్ అకౌంట్స్’ అనే ఆప్షన్ తో ఉంటుంది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.24.20.16 వెర్షన్ లో అందించింది. అయితే రాబోయే రోజుల్లో వాట్సాప్ ఈ ఫీచర్ ను అన్నీ వెర్షన్లలోకి అందుబాటులోకి తీసుకు వస్తుందని తెలుస్తుంది. ఈ ఫీచర్ వాట్సాప్ సెట్టింగ్లో ఉన్న అడ్వాన్స్ సెట్టింగ్ ట్యాబ్లో ఉంటుంది. ఈ ఫీచర్ను ఎనేబుల్ చేయడానికి పక్కన కనిపించే టోగుల్ ను ఆన్ చేయాలి. ఈ ఫీచర్ మనకు IP Protection ఫీచర్ పైన కన్పిస్తుంది. దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత, తెలియని వారు నుంచి వచ్చే మెసేజ్లు ఆటోమాటిగ్గా బ్లాక్ అవుతాయి. మరి వాట్సప్ ప్రవేశపెట్టిన ఈ తాజా సెక్యూరిటీ ఫీచర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.