iDreamPost

వారి మాట వినాలనుకుంటోంది.. ఆంధ్రప్రదేశ్‌

వారి మాట వినాలనుకుంటోంది.. ఆంధ్రప్రదేశ్‌

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి, నూతన ప్రభుత్వ కొత్త ఆలోచన మూడు రాజధానులపై చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి ఒక్క రాజధాని మాత్రమే ఉండాలనీ, అదీ అమరావతే కావాలని టీడీపీ నేతలు, రాజధాని ప్రాంతంలోని కొద్ది గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని, అందుకోసం ప్రభుత్వం చేస్తున్న మూడు రాజధానుల కు మద్దతుగా రాష్ట్ర ప్రజలు, టీడీపీతో సహా అన్ని రాజకీయ పార్టీల్లోని నేతలు ప్రకటనలు చేస్తున్నారు. హైకోర్టు కర్నూలులో, అసెంబ్లీ అమరావతిలో, సచివాలయం విశాఖలో ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి వికేంద్రికరణ జరిగి రాష్ట్రం సుభిక్షింగా ఉంటుందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ పార్టీల నేతలు, మేధావులు, రాజధాని ప్రాంత గ్రామాల ప్రజల మాటలు వింటోన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సరికొత్త ఆశ కలిగింది. మీడియా, రాజకీయ నాయకులు పట్టించుకోని ఆ గ్రామాల ప్రజల మనస్సును ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వినాలనుకుంటున్నారు. రాజధానిపై, ప్రభుత్వ కొత్త ప్రతిపాదనపై ఆ గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. వారే.. రాజధాని అమరావతి చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించకముందు ఆయా గ్రామాలలో వేలాది ఎకరాల భూములను టీడీపీ నేతలు కొనుగోలు చేశారు. దాన్నే ఇన్‌సైట్‌ ట్రేడింగ్‌ అని అంటున్నారు. రాజధాని.. నూజివీడు, ఇబ్రహీంపట్నం అంటూ ప్రజలను పక్కదోవ పట్టించి టీడీపీ నేతలు కొద్ది మంది మాత్రం అమరావతి చుట్టు పక్కల గ్రామాల్లో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు సాగించిన ఈ ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ వ్యవహారం 2017లో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల వరకు ఈ వ్యవహారం పై చర్చ సాగుతోంది.

టీడీపీ నేతలు అమరావతి చుట్టు పక్కల రైతుల నుంచి లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన భూములు రాజధాని ప్రకటన తర్వాత వాటి విలువ అమాంతం పెరిగింది. భూముల విలువ కోట్ల రూపాయలకు చేరడంతో భూములు కొన్న టీడీపీ నేతలు వందల కోట్ల విలువైన భూములకు యజమానులయ్యారు. వాస్తవంగా ఆ లబ్ధి రైతులకు చెందాలి. కానీ కుట్రపూరితంగా రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసీ టీడీపీ నేతల్లో కొందరు భూములు కొన్నారు.

హైదరాబాద్‌లో కోకాపేటలో కూడా అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఫార్ములా వినియోగించారు. కోకాపేట పరిసర ప్రాంతాల్లో ఎకరం ఏడెనిమిది లక్షలకు రైతుల నుంచి కొనుగోలు చేయగా ఆ తర్వాత 8 కోట్ల రూపాయలకు అమ్మకున్నారు. ఇదే విధంగా రాజధాని అమరావతి చుట్టు పక్కల గ్రామాల్లోనూ జరిగింది. ఈ నేపథ్యంలో తమ భూములను కారు చౌకగా కొనుగోలు చేసి, కోట్లకు పడగలెత్తిన టీడీపీ నేతలపై ఆయా గ్రామాల రైతులు ఏమనుకుంటున్నారో..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి