iDreamPost

గ‌డపగడపతో వైసీపీ, ఇదేం ఖర్మ అంటూ టీడీపీ, వారాహితో సేనాని?.

గ‌డపగడపతో వైసీపీ, ఇదేం ఖర్మ అంటూ టీడీపీ, వారాహితో సేనాని?.

ఎన్నికల భేరి ఒకటే, వివిధ పార్టీల యుద్ధ సన్నద్ధతలు ఏంటి? ఏపీలో ఏడాదిన్నర ముందే ఎన్నికల వేడి రాజుకొంది . ఒకవైపు అధికార వైఎస్సార్సిపి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో స్థానిక ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి తమ పార్టీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు క్షేత్ర స్థాయిలో అందరికీ అందాయా లేదా అన్నది పరిశీలించడంతో పాటు ప్రజలు ఇంకా తమ నుండి ఏమి ఆశిస్తున్నారు, పాలనలో మెరుగు పరుచుకోవాల్సిన అంశాలు ఏమిటి అన్నది శోధించుకొంటూ ముందుకు సాగుతున్నారు .

మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మనకి అనే కార్యక్రమాలతో ప్రజల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది. రాజకీయంగా నలభై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు ఎప్పుడూ లేనంతగా ఈసారి తడబడుతున్నారు అని చెప్పాలి. ప్రజాస్వామ్య మూలాలు, ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకొంటారు అన్న ప్రధాన సూత్రాలు మరిచి నేను ముఖ్యమంత్రిగా గెలిస్తేనే అసెంబ్లీకొస్తానని ప్రమాణం చేసాను కాబట్టి నన్ను గెలిపించండి, నా కుటుంబాన్ని అవమానించారు కాబట్టి నన్ను గెలిపించండి, మీరు గెలిపించకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలు కాబట్టి నన్ను గెలిపించండి అంటూ బేల పలుకులతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.

అయినా ఎన్నికల పోరులో గెలుస్తామనే నమ్మకం చిక్కక తనకి కలిసొచ్చిన పొత్తుల కుంపట్లు మళ్ళీ రగల్చటానికి చేస్తున్న ప్రయత్నాలు అంతగా కలిసి రావట్లేదనే చెప్పాలి. 2014 ఎన్నికలలో టీడీపీతో జట్టు కట్టిన బిజెపి తర్వాతి కాలంలో పొత్తు చిత్తయ్యాక టీడీపీ శ్రేణులు, చంద్రబాబు బిజెపిని, ప్రత్యేకించి మోడిని వ్యక్తిగతంగా దూషించిన తీరు, 2019 ఎన్నికల వేళ దేశాన్ని ఏకం చేస్తా, మోడిని దించేస్తా అంటూ చంద్రబాబు దేశంలో అన్ని రాజకీయ పక్షాల గడప తొక్కి రభస బిజెపి శ్రేణుల మనసులో నాటుకుపోయింది.

అందుకే ఇప్పుడు బిజెపి ప్రాపకం కోసం బాబు ఎంత ప్రయత్నించినా అటునుండి రిక్త హస్తమే ఎదురవుతుంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ విజయం అటుంచి సంక్షేమ పధకాలతో ప్రతి గడపలో నేనున్నా అంటూ కనపడుతున్న జగన్ హవాకి ఎదురొడ్డి నిలవడం ప్రస్తుత స్థితిలో కష్టమే.

పవన్ కళ్యాణ్ విషయానికొస్తే రాజకీయాల్లో కొచ్చి పద్నాలుగేళ్లు, సొంత పార్టీ పెట్టి తొమ్మిదేళ్లు అవుతున్నా ఇంకా బాలారిష్టాలు దాటకపోగా బియ్యంలో అక్షరాభ్యాసం చేసే దశ దాటి ముందుకు రాలేకపోతున్నాడు. ఓనమాలు దిద్దిద్దామనుకొన్న నాదెండ్ల మనోహర్ ప్రయత్నాలు సఫలమయ్యే దాఖలాలు కనపడట్లేదు .

2014 లో పార్టీ పెట్టి అనుభవం లేడు కాబట్టి, టిడిపికి మద్దతు ఇస్తున్నా టీడీపీ ఇచ్చే హామీలకు నాదీ పూచి అన్న పవన్ టీడీపీ అధికారం చేపట్టాక వారిచ్చిన హామీ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకపోయినా నాలుగేళ్ల పాటు నోరెత్తి ప్రశ్నించక పోగా ప్రతిపక్ష వైసీపీ పై నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడిపాడు . ప్రతి మాట, ప్రతి చర్యలోనూ జగన్ పై అసూయ, అసహనాలు వ్యక్తం చేసే పవన్ 2019 ఎన్నికల నాటికి ఒంటరిగా బరిలోకి దిగే ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో పోటీ చేయలేక కమ్యూనిస్ట్ లతో పొత్తు పెట్టుకొని, పలు చోట్ల టీడీపీతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకొని పోటీ చేసినా చివరికి పట్టుమని పది స్థానాలు కూడా గెలవలేక 175 కి ఒక్క సీటు గెలుచుకొని అభాసుపాలయ్యాడు.

2019 ఎన్నికల తర్వాత హటాత్తుగా కాషాయం కప్పుకొని బిజెపితో కలిసి ప్రయాణం చేస్తానన్న పవన్ తర్వాతి రోజుల్లో ఎక్కువకాలం స్థబ్దుగా ఉంటూ అడపాదడపా కనిపిస్తూ వచ్చారు కానీ స్థానిక ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయక పార్టీ గుర్తు సైతం కోల్పోయారు. ఏడాదిగా కాస్త క్రియాశీలకంగా కనపడుతున్న పవన్ తీరు గమనించిన రాజకీయ విశ్లేషకులు, మళ్ళీ బాబు అడుగుజాడల్లో నడుస్తున్నాడని అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనికి తగ్గట్టుగా బాబు పవన్ వ్యాఖ్యలు ఉండటంతో రాజకీయ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్త పుత్రుడు అని విమర్శించసాగారు, చివరికి ఒక ముహూర్తనా బాబు, పవన్ కలిసి ప్రెస్ ముందుకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి అందరం కలిసి కృషి చేస్తాం అని తేల్చడంతో సీఎం సీఎం అని అరిచే పవన్ అభిమానుల భ్రమలు పటాపంచలు అయ్యాయి. వెంటనే మోడీ నుండి పవన్ కు పిలుపు రావడం, కలిసి బయటకు వచ్చిన పవన్, నాదెండ్ల మొహాలు కత్తివేటుకు నెత్తురు చుక్క దొరకనంతగా డీలాపడి పొడి పొడిగా మాట్లాడి వెళ్లిపోవడం చూసిన జనాలు టీడీపీతో పొత్తు పట్ల మళ్ళీ సంధిగ్ధంలో పడ్డారు.

ఇదిలా ఉండగా రాజకీయంగా ప్రజల్ని ఆకర్షిద్దామని గత ఏడాదిగా ప్రయత్నిస్తున్న పవన్ ప్రతిసారి, ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని విమర్శించబోయి పస లేని, సత్య దూరమైన వార్తలతో వైసీపీని విమర్శించబోయి నవ్వుల పాలవ్వటం సేనానికి పరిపాటి అయ్యింది. జాతీయ గణాంకాల సాక్షిగా బాబు హయాంలో కన్నా, ఇప్పుడు రైతు ఆత్మహత్యలు గణన…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి