iDreamPost
android-app
ios-app

ఆంబోతులకు ఆవులను సప్లై చేసిన వ్యక్తి చంద్రబాబు: మంత్రి అంబటి

Ambati Comments Chandrababu: వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఒకరు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏ విమర్శ వచ్చిన వెంటనే స్పందించే వారిలో ఆయన ఒకరు. తాజాగా సీఎం జగన్ పై, తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి రాంబాబు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

Ambati Comments Chandrababu: వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఒకరు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏ విమర్శ వచ్చిన వెంటనే స్పందించే వారిలో ఆయన ఒకరు. తాజాగా సీఎం జగన్ పై, తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి రాంబాబు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

ఆంబోతులకు ఆవులను సప్లై చేసిన వ్యక్తి చంద్రబాబు: మంత్రి అంబటి

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్, సీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కౌంటర్లకు రివర్స్ కౌంటర్లు ఇస్తూ..పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల సమరంలో దూసుకెళ్తుంటే.. టీడీపీ, జనసేనలు ఇంకా అమోమయంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో సాక్షాత్తు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. శనివారం పల్నాడు జిల్లా గురజాలలో జరిగిన సభలో మంత్రి అంబటి రాంబాబుపై ఆరోపణలు చేశారు. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

శనివారం పల్నాడు జిల్లా గురజాల నియోజవర్గంలో  టీడీపీ ‘రా కదలి రా’  సభను నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా చంద్రబాబు ప్రసంగం కొనసాగించారు. అంతేకాక జిల్లా మంత్రి అయినా అంబటి రాంబాబును కూడా ఆంబోతు అంటూ అసభ్య పదజాలంతో తీవ్ర విమర్శలు చేశారు. దీంతో తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. నన్ను ఆంబోతు అంటున్నావ్‌.. నీ చరిత్ర ఏంటో తెలుసుకో చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.

“చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. అందుకే చంద్రబాబు ప్రజలను మభ్య  పెడుతున్నారు. టీడీపీ మునిగిపోతున్న పడవ. అందుకే అందులో నుంచి చాలా మంది బయటకు వస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశారు. చంద్రబాబు చెత్త పాలన చేశారు కాబట్టే చిత్తుచిత్తుగా ఓడిపోయారు. నన్ను ఆంబోతు అంటావా.. ఆంబోతులకు ఆవులను చంద్రబాబు సప్లయి చేశాడు. చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్తగా పెట్టుకోవాలి. చంద్రబాబు దేశంలోనే పెద్ద చీటర్. చంద్రబాబు పెద్ద మోసగాడు, ఓ 420, కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడాని చంద్రబాబే ప్రధాన కారణం. చంద్రబాబు కుట్రలకు కోడెల తీవ్ర మనస్థాపం చెందారు. కోడెల కుటుంబాన్ని చంద్రబాబు ఎంతో వేధించారు. చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారు. అంతేకాక కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని చంద్రబాబు వేధించారు. శివప్రసాద్ చనిపోయినా కూడా ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేదు. అందుకే కోడెల కుటుంబానికి టికెట్‌ ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు..మీకు, మీ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్‌ లేదు” అంటూ తీవ్ర స్థాయిలో మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మరి.. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinMeritbet güncel girişJojobet GirişcasibomHoliganbetgalabetHoliganbetCasibomJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişikimisliJojobet Giriş