iDreamPost
android-app
ios-app

ఏపీలో వారందరికి జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు

  • Published Sep 22, 2023 | 8:20 AM Updated Updated Sep 22, 2023 | 11:20 AM
  • Published Sep 22, 2023 | 8:20 AMUpdated Sep 22, 2023 | 11:20 AM
ఏపీలో వారందరికి జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పాలన అందిస్తూ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. బడుగు, బలహీన వర్గాల వారికి… ఆర్థిక సాయం అందజేస్తూ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలోని ఆటో , ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సెప్టెంబర్‌ 29న వారి అకౌంట్‌లలో డబ్బులు జమ చేయనుంది. దీని కోసం సీఎం జగన్‌.. ఈ నెల 29న కాకినాడలో వైఎస్సార్‌ వాహనమిత్ర ఐదో విడత ఆర్థిక సాయం విడుదల రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా బటన్‌ నొక్కి.. లబ్ధిదారుల ఖాతాల్లో 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. జిల్లా అధికారులు.. సభావేదిక, హెలిప్యాడ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని ఆటో , ట్యాక్సీ, మాక్సి క్యాబ్ నడిపే వాహనదారులకు ప్రతి ఏటా రూ.10వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. సొంతంగా ఆటో రిక్షా లేదా టాక్సీ లేదా టాక్సీ క్యాబ్ కలిగి ఉన్నావాళ్లు.. ఈ పథకానికి అర్హులు. అంతేకాక.. వాహనదారులకు సరైన డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. అర్హులైన లబ్ధిదారుడు నడుపుతున్న వాహనానికి సరైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) పొంది ఉండాలి. ప్రతి ఒక్క దరఖాస్తు దారునికి సరైన ఆధార్ కార్డ్.. లబ్ధిదారుడు బీపీఎల్, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఒక కుటుంబానికి ఒక వాహనానికి మాత్రమే ఈ సాయం అందజేస్తారు. ఇన్‌కమ్ సర్టిఫికెట్ కూడా కచ్చితంగా ఉండాలి

భర్త, భార్య, మైనర్ పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. వాహనం ఓనర్ షిప్, లైసెన్స్ రైస్ కార్డులో ఉన్నటువంటి ఎవరి పేరు మీద అయినా ఉండవచ్చు. ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలు కలిగి ఉంటే వారు వెంటనే తమ అడ్రస్‌ మార్చుకోవాలి. అప్లై చేసే వ్యక్తి పేరు మీద వాహనం.. సరైన బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అంతేకాక లబ్ధిదారు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసం ఉండటమే కాక.. 18 ఏళ్లు నిండి ఉండాలి.

marsbahis girişjojobet giriş