iDreamPost

APలోని మహిళల ఖాతాలోకి రూ.18,750.. పడేది ఎప్పుడంటే..

  • Published Mar 02, 2024 | 7:52 AMUpdated Mar 02, 2024 | 7:52 AM

వైఎస్సార్‌ చేయూత పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్‌ ఇచ్చింది. నిధుల జమ ఎప్పుడో వెల్లడించింది. ఆ వివరాలు..

వైఎస్సార్‌ చేయూత పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్‌ ఇచ్చింది. నిధుల జమ ఎప్పుడో వెల్లడించింది. ఆ వివరాలు..

  • Published Mar 02, 2024 | 7:52 AMUpdated Mar 02, 2024 | 7:52 AM
APలోని మహిళల ఖాతాలోకి రూ.18,750.. పడేది ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారు ఆర్థిక సాధికారత సాధించడం కోసం సీఎం జగన్‌ వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఏటా 18,750 రూపాయల చొప్పున​ నాలుగు దఫాల్లో రూ. 75 వేల మొత్తాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఇందుకు సంబంధించిన నిధులు విడుదల చేయగా.. నాలుగో విడత నిధులు జమ చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా మహిళల ఖాతాలో 18,750 రూపాయలు విడుదల చేయాలి. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్‌ ఇచ్చింది. వైఎస్సార్‌ చేయూత పథకం నిధులు విడుదల ఎప్పుడో వెల్లడించింది.

మహిళల ఆర్థిక సాధికారత కోసం తీసుకొచ్చిన వైఎస్సార్‌ చేయూత పథకం నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి నెలలోనే ఈమొత్తాన్ని విడుదల చేయాల్సి ఉంది.. కానీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీనిపై తాజా అప్డేట్‌ వచ్చింది. సీఎం జగన్‌ మార్చి 7న అనకాపల్లిలో బటన్‌ నొక్కి.. వైఎస్సార్‌ చేయూత పథకం నిధుల్ని విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత పథకం కింద.. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది.

ఏపీకి చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు. దీనికి అప్లై చేసుకునే వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, బ్యాంకు అకౌంట్ ఉండాలి. కుటుంబ ఆదాయం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల వారికైతే రూ.10వేలు, పట్టణ ప్రాంతాల వారికైతే రూ.12వేలు మించకూడదు. కుటుంబ మొత్తానికి మూడు ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాలకు మించి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. అలానే ప్రభుత్వ పెన్షన్ తీసుకునేవారు కూడా ఈ పథకానికి అనర్హులు. దాంతో పాటు కుటుంబానికి సంబంధించిన కరెంటు మీటర్ వినియోగం 6 నెలల సరాసరి 300 యూనిట్లకు మించకూడదు.

వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు. ప్రభుత్వం నోటిఫై చేసిన డేట్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాలంటీర్లు తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి సచివాలయం వెల్ఫేర్ అధికారికి అందజేస్తారు. ఆ తర్వాత వాటిని నవశకం పోర్టల్‌లో అప్ లోడ్ చేస్తారు. అనంతరం లబ్ధిదారుల వివరాలు సిక్స్ స్టెప్ వాలిడేషన్‌లో పాస్ అయిన వారిని అర్హులుగా గుర్తించి పథకం ప్రారంభించిన రోజు అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి