iDreamPost
android-app
ios-app

VRO, VRAలకు జగన్ సర్కార్ శుభవార్త! కీలక నిర్ణయం..

  • Author Soma Sekhar Published - 08:13 AM, Thu - 20 July 23
  • Author Soma Sekhar Published - 08:13 AM, Thu - 20 July 23
VRO, VRAలకు జగన్ సర్కార్ శుభవార్త! కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వోలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తమ సమస్యలను సీఎం జగన్ కు విన్నవించుకున్నారు సంఘం ప్రతినిధులు. ఈ విన్నపాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈనేపథ్యంలోనే ఏపీ సీఎస్ అధ్యక్షతన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ అంశాలపై చర్చించినట్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుకూడా ఆయన తెలిపారు. దాంతో రాష్ట్రంలోని వీఆర్ఏ, వీఆర్వోలకు లాభం చేకూరనుంది.

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వీఆర్ఏ, వీఆర్వోలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే తమ సమస్యలపై సీఎం జగన్ ను కలిశారు రెవెన్యూ సంఘం ప్రతినిధులు. వారి సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అదీకాక వీఆర్ఏలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఏలకు సంబంధించిన DA విడుదలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు బొప్పరాజు తెలిపారు. అలాగే వీఆర్వోలకు పదోన్నతుల అంశాన్ని కూడా సీఎం ముందు ఉంచారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ క్రమంలోనే వీఆర్వో ప్రమోషన్లలో 40 శాతం రేషియో అమల్లో ఉందని.. దాంతో చాలా మంది వీఆర్వోలకు సీనియర్ సహాయకుల పోస్టులు రావడం లేదన్నారు సంఘం ప్రతినిధులు. ఈ రేషియోను 70 శాతానికి పెంచాలని వారు ప్రభుత్వానికి విన్నవించారు. మరోవైపు అర్హత కలిగిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని సీఎం జగన్ ను కోరినట్లు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ నుంచి వీఆర్వోకు అర్హత కలిగిన 1500 మందికి పరీక్ష నిర్వహించి.. పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాలన్నింటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు రవీంద్రరాజు పేర్కొన్నారు.